ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతుంది అనే విషయం ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఎన్టీఆర్ 30 సినిమా గా రూపొందబోతున్న ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు గత ఏడాదిలోనే మొదలు పెట్టాలని భావించారు. కాని కరోనా ఇతర కారణాల వల్ల సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నాయి.
దర్శకుడు కొరటాల శివ గత రెండేళ్లుగా మోస్తూ వస్తున్న ఆచార్య సినిమాను కొరటాల శివ ఎట్టకేలకు రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఆచార్య సినిమా విడుదల అయిన రెండు వారాల్లోనే ఎన్టీఆర్ 30 సినిమా వర్క్ ను కొరటాల శివ మొదలు పెట్టబోతున్నాడట. ఆచార్య కు జరిగిన ఆలస్యం ను కవర్ చేసే విధంగా ఎన్టీఆర్ 30 సినిమాను చాలా తక్కువ సమయంలో పూర్తి చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడట.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అతి త్వరలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ వరకు మొదటి షెడ్యూల్ ప్రారంభించే అవకాశం ఉందని ఆమద్య దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చాడు. తాజాగా దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30 గురించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెళ్లడించడం ద్వారా ఎన్టీఆర్ అభిమానులు పుల్ హ్యాపీగా ఉన్నారు.
ఎన్టీర్ 30 సినిమా షూటింగ్ ప్రారంభం అయినా కాకున్నా కూడా ఆయన పుట్టిన రోజు అయిన మే 20వ తారీకున ఖచ్చితంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఇవ్వబోతున్నట్లుగా కొరటాల శివ చెప్పుకొచ్చాడు. రేపు విడుదల కాబోతున్న ఆచార్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కొరటాల శివ పలు సందర్బాల్లో ఎన్టీఆర్ 30 సినిమా గురించి స్పందించాడు.
ఒక భారీ కథను.. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రూపొందించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈసారి బోర్డర్ దాటేస్తాం అన్నట్లుగా కూడా కొరటాల శివ చాలా నమ్మకంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్ ను మే 20న ఇవ్వబోతున్నట్లుగా కొరటాల శివ ప్రకటించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో ఉన్నారు. ఇదే ఏడాదిలో సినిమా విడుదల చేయాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. మరి కొరటాల శివ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడా అనేది చూడాలి.