జూనియర్ చెప్పిన ‘ప్రణతి’ ముచ్చట్లు

Update: 2016-01-10 04:55 GMT
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా పలు ఆసక్తికర అంశాలపై పెదవి విప్పారు. మరో మూడు రోజుల్లో.. ‘‘నాన్నకు ప్రేమతో..’’ పలుకరించేందుకు సిద్ధమైన తరుణంలో మీడియాకు భారీగా ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటం.. వ్యక్తిగత విషయాల గురించి అట్టే మాట్లాడకుండా ఉండే తారక్ తాజాగా మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు.

లక్ష్మీ ప్రణతి గురించి ఇప్పటివరకూ పెద్దగా మాట్లాడని జూనియర్.. తన జీవితంలో ఆమె ప్రభావం ఎంతన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. తన జీవితంలోకి ప్రణతి వచ్చాక చాలానే మారిపోయిందని.. తనలో ఫోకస్ పెరిగినట్లు చెప్పారు. ప్రణతి తనకు మరో అమ్మగా అభివర్ణించిన ఎన్టీఆర్.. తనలో ఒక పిల్లాడు ఉంటాడని.. వాటిని ఎప్పుడూ అలానే ఉంచేస్తుందని చెప్పుకొచ్చాడు.

ఇలా ప్రణతిలోని పాజిటివ్ కోణాలతో పాటు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ను వెల్లడించాడు. ప్రణతికి వంట రాదని.. కానీ తన కోసం కేక్ చేసేందుకు ప్రయత్నిస్తే అది కాస్తా మాడిపోయిందని తారక్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఆ దెబ్బకు తమ కుక్.. మేడమ్ ను వంట మానేయమనండి సార్ అంటూ పారిపోయాడట. తాను వంట బాగా చేస్తానని.. కాకుంటే అతి కష్టమ్మీదా ప్రణతి ఇప్పుడు అమ్లెట్ వేసేందుకు ట్రై చేస్తున్నట్లు చెప్పాడు.
Tags:    

Similar News