నాన్నకి ప్రేమతో.. అంటూ ఫాదర్ సెంటిమెంట్ తో మంచి మూవీ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. సుకుమార్ డైరెక్షన్ కావడంతో.. ఎమోషన్స్ కూడా బాగానే పండిస్తాడనే విషయం అర్ధమవుతుంది. సుక్కు సెంటిమెంట్ కి, యంగ్ టైగర్ మార్క్ యాక్షన్ జోడైతే.. ఇక ఫ్యాన్స్ కి పండగే అని చెప్పనక్కర్లేదు.
నాన్నకి ప్రేమ పంచుతున్న అబ్బాయి.. బాబాయితో మాత్రం యుద్ధానికి సై అంటున్నాడు. సంక్రాంతి రిలీజ్ విషయంలో ఎన్టీఆర్ - బాలయ్యల మధ్య ఇంకా వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా సంక్రాంతి రిలీజ్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేయడమే కాదు.. జనవరి 13నే రిలీజ్ డేట్ అంటూ ప్రెస్ నోట్ కూడా పంపింది చిత్ర యూనిట్. అంటే బాలయ్య మూవీ డిక్టేటర్ విడుదలకు ఒక్క రోజు ముందు ఎన్టీఆర్ రావడం ఫిక్స్ అయిందన్న మాట. నాన్నకు ప్రేమతో మూవీకి ముందు ఇచ్చిన రిలీజ్ డేట్ అయితే జనవరి 8. అక్కడి నుంచి వారం గ్యాప్ లో బాలకృష్ణ మూవీ వస్తుందంటేనే.. పోటీ పడితే నష్టమంటూ బోలెడు వార్తలొచ్చాయి. మరిప్పుడు ఒక్క రోజు ముందు రావడమంటే నేరుగా సై అనడంగానే చెప్పాలి. టఫ్ ఫైట్ కి దిగినపుడు.. బాలయ్య వీరాభిమానులు బాయ్ కాట్ చేసే అవకాశం లేకపోలేదు. ఆ విషయం ఎన్టీఆర్ కి కూడా తెలుసనే చెప్పాలి.
కానీ సంక్రాంతి సీజన్ అంటే.. సినిమా బాగుంటే సూపర్బ్ కలెక్షన్స్ వస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి ఓరోజు ముందే వచ్చి తనదే పైచేయి అని ప్రూవ్ చేసుకునేందుకే ఎన్టీఆర్ ఈ స్టెప్ తీసుకున్నాడన్నది ఇండస్ట్రీ వర్గాల అంచనా. మరి యంగ్ టైగర్ మనసులో ఏముందో? అసలు నందమూరి ఫ్యామిలీలో.. ఈ ఫైట్ ఎందుకు బాసూ?