‘గజిని’ సినిమాతో తెలుగులో తిరుగులేని మార్కెట్ సంపాదంచుకున్నాడు సూర్య. అంతకుముందు రజినీకాంత్.. కమల్ హాసన్ లాంటి వాళ్లకు కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉంది. సూర్య తర్వాత కూడా కొందరు తెలుగులో మార్కెట్ తెచ్చుకున్నారు. కానీ వాళ్లెవ్వరూ కూడా తెలుగు ప్రేక్షకుల్ని సూర్య పట్టించుకున్నంతగా పట్టించుకున్నది లేదు. తన ప్రతి సినిమాలోనూ కొంత భాగమైనా తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరించాలని చూస్తాడు సూర్య. నేటివిటీ విషయంలో కూడా చాలా శ్రద్ధ చూపిస్తాడు. నేమ్ బోర్డులేవైనా కనిపించే చోట కచ్చితంగా తెలుగు అక్షరాలు ఉండేలా చూస్తుంటాడు. ఇక సినిమాల నేపథ్యం కూడా తెలుగు రాష్ట్రాల్లో సాగేలా చూసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సింగం సిరీస్ సినిమాలు చాలా వరకు విశాఖపట్నంలోనే చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇక ఈ సిరీస్ లో మూడో సినిమా ‘ఎస్-3’ షూటింగ్ అయితే మెజారిటీ పార్ట్ వైజాగ్ లోనే జరగడం విశేషం.
మరో విశేషం ఏంటంటే.. ‘ఎస్-3’లో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నాటి పరిణామాల్ని గుర్తుచేసే సన్నివేశాలు ఉంటాయట. ఎన్టీఆర్ హయాంలో ఒక దశలో ఆంధ్రా పోలీసులతో కలిసి తమిళనాడు పోలీసులు పని చేస్తారు. ‘ఎస్-3’లో సైతం ఇలా రెండు రాష్ట్రాల పోలీసులు కలిసి ఆపరేషన్ చేపట్టే సన్నివేశాలు కథకు కీలకంగా ఉంటాయట. సింగం-2లో చివర్లో కాసేపు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోసం విదేశీ పర్యటన చేసే హీరో.. ఇందులో చాలా దేశాలు తిరిగి.. క్రిమినల్స్ ఆట కట్టిస్తాడట. సినిమాలో తెలుగు ప్రేక్షకులు బాగా ఐడెంటిఫై అయ్యేలా చాలా సన్నివేశాలు తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ నెల 23న ‘ఎస్-3’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/