#HBD చెర్రీ: జ‌క్క‌న్న ఏమో అలా తారక్ ఏమో ఇలా!

Update: 2021-03-27 10:06 GMT
రామ్ చ‌ర‌ణ్ అలియాస్ రామ‌రాజు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ గ‌త రెండు రోజులుగా పీక్స్ కి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌రోజు ముందే చెర్రీకి ఉపాస‌న అదిరిపోయే కానుక‌లివ్వ‌డం మురిపెంగా వాటి వివ‌రాలను సోష‌ల్ మీడియాల్లో పంచుకోవ‌డం ఆక‌ర్షించింది. నేటి ఉద‌యం మెగాస్టార్ చిరంజీవి హ్యాపీ బ‌ర్త్ డే మై బోయ్ అంటూ ఎమోష‌న‌ల్ విషెస్ చెప్ప‌డం అభిమానుల్ని ఆక‌ట్టుకుంది.

ఇంత‌కీ ఆర్.ఆర్.ఆర్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నుంచి విషెస్ అందాయా?  త‌న స్నేహితుడు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి గిఫ్ట్ అందింది? అంటే.. దానికి ఇవిగో ఇవే ప్రూఫ్ లు. ఆర్.ఆర్.ఆర్ సెట్లో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి స్వ‌యంగా బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేయించి చెర్రీకి తినిపించిన ఫోటో వైర‌ల్ గా మారింది. జ‌క్క‌న్న‌కు చ‌ర‌ణ్ అంటే ఎంత‌టి ప్రేమాభిమానాలో ఈ ఫోటోనే సాక్ష్యం. రెండేళ్ల పాటు త‌న ప్రాజెక్ట్ కోసం చెర్రీని లాక్ చేసి ఇలా కేక్ తినిపిస్తాడా? అంటూ అభిమానులు త‌మ‌దైన శైలిలో ఫ‌న్నీగా సెటైర్ వేస్తున్నారు. జ‌క్క‌న్న‌-దాన‌య్య‌-కార్తికేయ - సెంథిల్ టీమ్ సెట్లో చెర్రీతో బోలెడంత ఫ‌న్ మూవ్ మెంట్ ని ఎంజాయ్ చేశార‌ని తాజా ఫోటోలు చెబుతున్నాయి.

మ‌రోవైపు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న‌దైన శైలిలో విషెస్ తెలిపారు. ధైర్యవంతుడు.. నిజాయితీపరుడు.. నీతిమంతుడు.. అతడే నా సోదరుడు రామ్‌చరణ్‌! అంటూ తార‌క్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంవ‌త్స‌రం మ‌న‌కు గొప్ప‌గా ఉండ‌బోతోందంటూ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

చిట్టిబాబు పాలిట రామ‌ల‌క్ష్మి అక్కినేని వారి కోడలు సమంత కూడా శుభాకాంక్షలు తెలిపారు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా హ్యాపీ బర్త్‌డే మై స్వీట్‌ బ్రదర్‌ అంటూ బర్త్ ‌డే విషెస్‌ తెలిపారు. బుట్ట బొమ్మ పూజ హెగ్డె.. రంగ‌మ్మ‌త్త‌‌ అనసూయ ఇత‌ర సెల‌బ్రిటీలు చ‌ర‌ణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:    

Similar News