సాధారణంగా సినిమా హీరోలు అయిదు పదుల వయసుదాటినా ఇంకా ఏజ్ కనిపించకుండా ఉండడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా వారు చేసే పాత్రలు కూడా ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటాయి. అయితే కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా వయసుని దాచి ఇంకా యువకులమే అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ అని చెప్పాలి.
1980ల్లోనే వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటికీ కూడా మొదటి సినిమాలో ఎలా ఉన్నారో అలానే కనిపిస్తారు. ముఖ్యంగా ఆయన తెరపై ఎలా కనిపిస్తారో బయటకూడా అలాగే కనిపిస్తారు. ప్రస్తుతం సినిమాల్లో కూడా ఆయన చేసే పాత్రలు ఎక్కువగా యువ పాత్రలే ఉంటున్నాయి. అయితే అసలు విషయానికి వస్తే రీసెంట్ గా జరిగిన ఎన్టీఆర్ "జై లవకుశ" సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ యాంకర్ సుమ మరియు హీరో ఎన్టీఆర్ బ్రహ్మాజీ వయసుపై కామెంట్ చేసి ఆయనను ఆటపట్టించారు. ముఖ్యంగా సుమ బ్రహ్మాజీ పై వేసిన పంచులకు వేడుకలో ఉన్న ప్రముఖులు తెగ నవ్వేశారు. బ్రహ్మాజీ గారు మీ వయసు 72 అని ఎవరికి తెలియదు అని అనడంతో బ్రహ్మాజీ కూడా సుమకిి కౌంటర్ వేసేందుకి ట్రై చేశారు.
నాకూ రాజీవ్ కు రెండేళ్ళ తేడా అని అన్నాడు. దీంతో మరో వైపు ఎన్టీఆర్ చెన్నైలో మొదట అడుగుపెట్టింది బ్రహ్మాజీనే అని చెప్పాడు. ఇక అలనాటి నటి నటులతో ఆయనకు సంబంధం ఉన్నట్లు చెప్పడం కూడా వేడుకలో హైలెట్ అయ్యింది. ఇక బ్రహ్మాజీ గారు సుమ-ఎన్టీఆర్ కౌంటర్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిద్దాం అనుకున్నా సాధ్యపడలేదు. అయితే చివరికి సుమనే మ్యాటర్ డైవర్ట్ చేసి వేడుకను కొనసాగించారు.