ఈ శుక్రవారం మొదలు వారం వారం రెండు మూడు సినిమాలు చొప్పున రిలీజవుతూ తెలుగు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. డిసెంబర్ 21న మూడు సినిమాలు - డిసెంబర్ 28న మరో రెండు చిత్రాలు రిలీజవుతున్నాయి. అంతరిక్షం - పడి పడి లేచే మనసు - కె.జి.ఎఫ్ చిత్రాలు ఈ వారంలో రిలీజవుతున్నాయి. ఆ క్రమంలోనే ఈ సినిమాల ప్రచారంలో వేగం పెరిగింది. కె.జి.ఎఫ్ ప్రీరిలీజ్ వేడుక ఇదివరకూ ఘనంగా జరిగింది. అంతరిక్షం - పడి పడి లేచే మనసు ప్రీరిలీజ్ వేడుకలకు రెడీ అవుతున్నాయి. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. వరుణ్ తేజ్ కోసం చరణ్ - శర్వానంద్ కోసం బన్ని ప్రీరిలీజ్ వేడుక అతిధులుగా విచ్చేస్తున్నారన్న సమాచారం అందింది.
ఇక ఒకటొకటిగా ప్రిరీలీజ్ పేరుతో సందట్లో సడేమియా సాగుతుంటే.. తాజాగా చెర్రీ అప్ డేట్ కూడా లీకైంది. జనవరి 4న `వినయ విధేయ రామా` ప్రీరిలీజ్ వేడుక కు ప్లాన్ చేస్తున్నారని - ఇప్పటికే వెన్యూ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీగా మెగాభిమానుల హంగామా నడుమ వీవీఆర్ వేడుక జరనుందని తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నాడట. అలాగే రాజమౌళి - రానా విచ్చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాల్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
`రంగస్థలం` లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడమే ధ్యేయంగా సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. `వినయ విధేయ రామా` చిత్రాన్ని జనవరి 11న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. అంతకు రెండ్రోజుల ముందు ఎన్టీఆర్- కథానాయకుడు సినిమా రిలీజవుతుంటే - జనవరి 12న వెంకీ ఎఫ్ 2 రిలీజవుతోంది. సంక్రాంతి బరిలోనే ఇరుగు పొరుగు నుంచి భారీ చిత్రాలు బరిలో ఉన్నాయి. అందుకే `వినయ విదేయ రామా` చిత్రానికి ప్రచారం హోరెత్తించాలని దర్శకుడు బోయపాటి సీరియస్ గా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి నుంచే సింగిల్స్ రిలీజ్ - కొత్త పోస్టర్ల రిలీజ్ తో ప్రచారం హోరెత్తిస్తారట. అటుపై జనవరి 4 నుంచి మీడియా ఇంటరాక్షన్స్ లో వేగం పెంచుతారని తెలిసింది. సంక్రాంతికి కాంపిటీషన్ గట్టిగా ఉంది. ఈ పోటీలో నెగ్గుకు రావాలంటే ప్రచారం పరంగా ఇతరుల కంటే ముందుండాలని చరణ్ - బోయపాటి - దానయ్య అండ్ టీమ్ సన్నాహకాల్లో ఉన్నారట.