అసలు తెలుగులో బిగ్ బాస్ షో మొదలైన రోజు నుండి.. అబ్బే షో బాలేదు.. జూనియర్ ఎన్టీఆర్ ఓపెనింగ్ ఎపిసోడ్లో డైలాగులు పట్టిపట్టి మాట్లాడాడు.. అబ్బే కంటెస్టంట్లు అస్సలు బాగాలేదు అంటూ చాలా నెగెటివ్ కామెంట్లు వినిపించాయి. ఈ మొత్తంలో సోషల్ మీడియాలో దొర్లిన కామెంట్లే ఎక్కువగా ఉంటే.. వాటిలో కంటెస్టంట్లను టార్గెట్ చేసిన మాటలకు అనేకం. అయినాసరే ఇప్పుడు ఆ ఓపెనింగ్ ఎపిసోడ్ నుండి మొన్నటి వరకు చూసుకుంటే కు రికార్డు స్థాయిలో టిఆర్పీలు వచ్చాయి తెలుసా?
జూలై 16న 'బిగ్ బాస్' తెలుగు వర్షన్ తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. అప్పటి నుండి నెగెటివ్ టాక్ వస్తూనే ఉంది. కాని విషయం ఏంటంటే.. ఈ షో రోజువారీ గడుస్తున్న కొద్దీ.. నిధానంగా టిఆర్పీలు పెరిగిపోసాగాయి. అందులోనూ ఎన్టీఆర్ వీకెండ్స్ లో మాత్రమే కనిపిస్తాడు.. కంటెస్టంట్లను ఎలిమినేట్ చేస్తాడు అని అందరికీ అర్ధమవ్వడంతో.. ఇక మనోళ్లు వీకెండ్ ఎపిసోడ్ కోసం కాచుకుని కూర్చున్నారు. వారమంతటా వచ్చే ఎపిసోడ్లకు 10.4+ టిఆర్పీలు వస్తే.. వారాంతంలో ఎన్నటీఆర్ కనిపించిన ఎపిసోడ్స్ కు 16.1+ టిఆర్పీలు వచ్చేశాయి. దానితో ఏకంగా స్టార్ మా వాళ్ళ లెక్కలే మారిపోయాయ్. ఈ సంవత్సరంలో 29వ వారానికి కాను.. స్టార్ మా అన్ని ఛానల్స్ కంటే ముందుకు దూసుకెళ్ళి నెం.1 స్థానంలో ఉండిపోయింది. అంతేకాదు.. 'బిగ్ బాస్'కు వచ్చిన 16.1 టిఆర్పీ ఏదైతే ఉందో.. ఇప్పటివరకు తెలుగు టివి చరిత్రలోనే అదే హైయస్ట్.
ఎన్టీఆర్ హోస్టింగ్ పద్దతి మార్చడం.. అలాగే కంటెస్టంట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆతృత.. జ్యోతిని సాగనంపడం.. ఇక సంపూర్ణేష్ బాబు డ్రామాలు.. వెరసి అన్నీ కలపి నెగెటివ్ రివ్యూలు తెచ్చుకున్న 'బిగ్ బాస్'ను నెం.1 స్థానంలో కూర్చోబెట్టాయి. అది సంగతి.