అవును ఎన్టీఆర్ బయోపిక్ బాక్స్ ఆఫీస్ కు దర్శకులకు ఓ టీచర్ గా మారింది. సినిమాను ఎలా తీయకూడదో నేర్పిస్తూ అతిశయోక్తులకు పోయి వాస్తవాలను దాచి బయోపిక్ లను తీస్తే ఎలాంటి ఫలితాలు అందుకోవచ్చో వసూళ్లను సాక్ష్యంగా చూపించి మరీ నేర్పిస్తోంది. కనీసం అభిమానులు సైతం ఆదరించలేనంత దారుణంగా కథానాయకుడు మహానాయకుడు ఫలితాలు రావడం పట్ల నందమూరి క్యాంప్ ఎంత కలవరపడుతుందో తెలియదు కానీ సినిమాను దాని రేంజ్ కి మించి కొన్న బయ్యర్లకు మాత్రం పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఇక్కడ ఎన్టీఆర్ బోధించిన కొన్ని పాఠాలు గమనిస్తే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు ఎవరూ చేయకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
ఎన్టీఆర్ లో కావలసిన హంగులు అన్ని ఉన్నాయి. చిన్న పాత్రలకు సైతం పేరున్న డిమాండున్న ఆరిస్టులు. కీరవాణి లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్. కత్తి లాంటి పదునైన మాటలు రాసే సాయి మాధవ్ బుర్ర. జ్ఞాన శేఖర్ లాంటి టాప్ కెమెరా టెక్నీషియన్. నిర్మాణంలో రాజీ లేకుండా స్వంత కొడుకుతో సహా మొత్తం ముగ్గురు అన్న గారి వీరాభిమానులే నిర్మాతలు. అయినా తేడా కొట్టింది. కారణం అన్ని ఉన్నాయి కానీ కథలో అసలైన ఆత్మ లేదు.
ఎన్టీఆర్ స్తుతి ఆయన కీర్తిని ఎక్కువ చేసి చూపించాలన్న తపన తప్ప ఆయన మేరునగ వ్యక్తిత్వాన్ని బలంగా చూపించే సన్నివేశాలు ఒక్కటంటే ఒక్కటీ లేవు. ఎంతసేపూ టీవీలో ఫ్రీగా చూసే పాత పాటలను మరోసారి షూట్ చేసి బాలయ్య డాన్స్ చేయడం తప్ప ఇది హై లైట్ అనిపించేదేది కథానాయకుడులో లేదు
ఇక మహానాయకుడులో టిడిపి ప్రస్థానాన్ని చూపించిన తీరు ఎన్టీఆర్ రాజకీయ ఎదుగుదలలో చంద్రబాబు నాయుడు పాత్ర చాలా ఉందనే సందేశాన్ని ఇచ్చేందుకు పడిన తాపత్రయం మినహా ఇంకేమి కనిపించదు. పైగా సౌలభ్యం కోసం పొందుపరచని వాస్తవాలు అభిమానులను సైతం హర్ట్ అయ్యేలా చేశాయి. తన తల్లితండ్రుల మధ్య ఎంత గొప్ప అనుబంధం ఉందొ చూపించడానికి అవసరానికి మించి పెట్టిన భార్యాభర్తల ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు.
12 మంది పిల్లల్ని కనడమే బసవతారకం గారిని మహోన్నత మహిళగా చూపేందుకు అర్హత అనేలా రాసుకున్న నేరేషన్ ఎలా కనెక్ట్ అవుతుంది. అంత కన్నా గొప్ప లక్షణాలను చూపించాలి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో పెద్ద సిలబస్ అవుతుంది కానీ టీచర్ గా మారి ఎన్టీఆర్ చెప్పిన పాఠాలు ఒంటబట్టించుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఖరీదైన తప్పులు ఇంకెవరూ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేదూ అంటే ఇదే చరిత్ర రిపీట్ అవుతూనే ఉంటుంది