తెలుగులో ‘మహానటి’ తర్వాత అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న బయోపిక్ ‘యన్.టి.ఆర్’. ఇప్పటికే ఈ చిత్రం ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఐతే షూటింగ్ మొదలయ్యే సమయానికి ఈ చిత్రంలో ఎవరెవరు ఏ పాత్ర చేస్తారనే విషయంలో ఒక క్లారిటీ లేకపోయింది. ఇప్పుడు దాదాపుగా ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చేసినట్లే ఉంది. గత కొన్ని రోజుల్లో ఈ సినిమాలో కొన్ని ముఖ్య పాత్రలకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి.
ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారమైతే ‘యన్.టి.ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ భార్యగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. దగ్గుబాటి రానా.. చంద్రబాబు పాత్రను పోషిస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు సుమంత్ ఎంపికయ్యాడు. ఇక దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ.. నిర్మాత హెచ్.ఎం.రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్ ను నాగిరెడ్డి పాత్రలో చూడబోతున్నాం. మురళీ శర్మ చక్రపాణిగా దర్శనమివ్వనున్నాడు. ఎన్టీఆర్ మిత్రుడైన సుబ్బారావు పాత్రలో సీనియర్ నటుడు నరేష్ నటిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సచిన్ ఖేద్కర్.. నాదెండ్ల భాస్కరరావు పాత్రలో కనిపించనున్నాడు.
నందమూరి కళ్యాణ్ రామ్.. హరికృష్ణ పాత్రలో నటిస్తాడని అంటున్నారు కానీ.. దీనిపై ఇంకా అధికారిక సమాచారం బయటికి రాలేదు. అలాగే సావిత్రిగా ‘మహానటి’లో కనిపించిన కీర్తి సురేష్ నే ఎంపిక చేసినట్లు చెబుతున్నారు కానీ.. దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరం. ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగించాలనుకుంటున్నారట. ఆ పాత్రలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ నటిస్తాడని ఇంతకుముందు ప్రచారం జరిగింది. మరి ఇందులో నిజమెంతో చిత్ర బృందానికే తెలియాలి. త్వరలోనే ఈ చిత్ర రెండో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.