కేజీఎఫ్ నీల్ త‌ర్వాతే బుచ్చిబాబుకు ఛాన్స్?

Update: 2022-10-09 13:30 GMT
ప్ర‌స్తుతం టాలీవుడ్ ఫేజ్ మారుతోంది. మ‌న స్టార్ హీరోల ఆలోచ‌న‌లు అమాంతం మారాయి. పాన్ ఇండియా ట్రెండ్ అంత‌కంత‌కు ఊపేస్తోంది. ఇదే ఒర‌వ‌డిలో వ‌రుస‌గా స్టార్ హీరోలంతా ఎవ‌రికి వారు తాము పాన్ ఇండియా సినిమాలు చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇప్పుడు యంగ్ య‌మ ఎన్టీఆర్ కూడా రేసులో ఉన్నాడు.

నిజానికి అత‌డు `ఉప్పెన` ఫేం బుచ్చిబాబుతో ఈపాటికే సినిమాని ప్రారంభించాల్సింది. కానీ ఈ ప్రాజెక్టును అంత‌కంత‌కు ఆల‌స్యం చేస్తున్నాడు. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతోంది? అంటే తార‌క్ లో మారిన‌ ఆలోచ‌న‌లే దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించాక తార‌క్ ఇమేజ్ మారింది. దానికి తగ్గ‌ట్టుగానే క‌థ‌లు ద‌ర్శ‌కుల‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ర‌కంగా చూస్తే అత‌డు వ‌రుస‌గా పాన్ ఇండియా ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయాల్సి ఉంది.

కానీ ఇప్ప‌టికే త‌న స్నేహితుడు కొర‌టాల‌కు .. బుచ్చిబాబుకు కూడా క‌మిట్ మెంట్లు ఇచ్చేశాడు. మ‌రోవైపు మైత్రి సంస్థ కేజీఎఫ్ ద‌ర్శ‌కుడిని లైన్ లో పెట్టి తార‌క్ పై ప్రెజర్ తెస్తోంది. అందువ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ని వెంట‌నే చేయాల్సి ఉంది. పైగా పాన్ ఇండియా వేడిలో ప్ర‌శాంత్ నీల్ తో క‌లిసి మ్యాజిక్ చేయాల‌ని తార‌క్ క‌ల‌లుగంటున్నాడు. ముందు కొర‌టాల‌తో సినిమా కానిచ్చేశాక ప్ర‌శాంత్ నీల్ తో సెట్స్ పైకి వెళ‌తాడు. ఆ త‌ర్వాతే బుచ్చిబాబుకు ఛాయిస్ ఉంటుంద‌ని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

నిజానికి తన తొలి ప్ర‌య‌త్న‌మే ఉప్పెనతో బ్లాక్ బస్టర్ ని అందించిన దర్శకుడు బుచ్చి బాబు సానా వెంట‌నే ఎన్టీఆర్ ను దర్శకత్వం వహించాల్సి ఉన్నా.. ఆ సినిమా అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంది. కానీ ఇంత‌కాలం బుచ్చిబాబు తార‌క్ కోస‌మే ఓపిగ్గా వేచి చూసాడు. కానీ తాజా స‌న్నివేశం అర్థం చేసుకుని బుచ్చిబాబు ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని మరో హీరోతో చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని తెలిసింది.  దీనికోసం ఎన్టీఆర్ నుంచి కూడా అనుమతి తీసుకున్నాడట‌.

ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న బుచ్చిబాబు చాలా కాలం క్రితం కథను చెప్పి ఒప్పించాడు. కానీ ప‌రిస్థితులు క‌లిసి రాలేదు. అయినా బుచ్చిబాబు లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ త‌న‌ను తాను నిల‌బెట్టుకునేందుకు శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తాడ‌న‌డంలో సందేహం లేదు. అత‌డి సెన్సిబిలిటీస్ ఎబిలిటీస్ పై అభిమానుల‌కు న‌మ్మ‌కం ఉంది. న‌వ‌తరం హీరోల‌తో స‌త్తా చాటి అప్పుడు తార‌క్ తో రెడ్ కార్పెట్ ఇన్విటేష‌న్ అందుకుంటాడ‌ని భావించ‌వ‌చ్చు.

ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాకి చాలా సమయం పడుతోంది. ఈ ఆల‌స్యానికి కార‌ణాలు కూడా అనేకం. ఆచార్య లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కొర‌టాల తార‌క్ తో పాన్ ఇండియా మూవీ చేయాల‌నుకుంటున్నాడు. గ్రేట్ కంబ్యాక్ అంటే ఏంటో చూపించాల‌ని త‌ప‌న‌తో ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News