నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. బాలనటుడిగా సినీ ప్రస్థానం మొదలు పెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ లాక్ డౌన్ వలన ఇంటికే పరిమితమయ్యారు. భార్యతో ఇద్దరు పిల్లలతో కలిసి ఆనంద క్షణాలు గడుపుతున్నారు. ఈ రోజు ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి నేడు తమ 9వ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. 2011 మే 5న ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతిని వివాహబంధంతో ఒకటయ్యారు. వీరి అన్యన్యమైన తమ బంధానికి ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి కూడా బ్రేక్ పడిన నేపథ్యంలో ఆయన కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇదే సమయంలో వారి వెడ్డింగ్ యానివర్సరీ కూడా కలిసి రావడంతో ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి ఈ వేడుకను తమ ఇద్దరు పిల్లలైన అభిరామ్, భార్గవ్ రామ్ లతో జరుపుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ ఆర్ ఆర్'లో 'కొమరం భీమ్' రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే 75 శాతానికి పైగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా స్పెషల్ ఇంట్రో వీడియో రానుంది. లాక్ డౌన్ అనంతరం నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. దీనితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 30వ చిత్రం ఎన్టీఆర్ కమిట్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలో మొదలు కావాల్సివుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతూ దూసుకుపోతున్నాడు తారక్.