హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ నాగార్జున మరియు చిరంజీవిలు తీసుకు వచ్చారు. ఇద్దరు స్టార్స్ చేసినా కూడా రేటింగ్ విషయంలో నిరాశ పర్చింది. దాంతో స్టార్ మా వారు షో ను వదిలేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి మాత్రం సూపర్ హిట్ గా దూసుకు పోతూనే ఉంది. తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా కేబీసీ కాన్సెప్ట్ ను ఆధరిస్తారు అనే నమ్మకంతో జెమిని టీవీ వారు సరికొత్తగా ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఎన్టీఆర్ హోస్ట్ గా తీసుకు వచ్చారు. షో ప్రకటించిన సమయంలో చాలా ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ టీవీ షో అవ్వడం వల్ల ఖచ్చితంగా మంచి రేటింగ్ వస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కాని ఎన్టీఆర్ ఛరిష్మా కూడా పెద్దగా పని చేస్తున్నట్లుగా లేదు అంటున్నారు.
ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రెండు వారాలు పూర్తి అయ్యింది. మొదటి వారంలో మొదటి రెండు ఎపిసోడ్ లు రామ్ చరణ్ ఉండటం వల్ల మంచి రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత ఎపిసోడ్స్ కు మాత్రం ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు అనేది టాక్. ఎన్టీఆర్ కంటెస్టెంట్స్ తో చాలా ఆసక్తికర సంభాషణలు కొనసాగిస్తున్నాడు. వారితో బాగానే ఆట ఆడిస్తున్నాడు. కాని ప్రేక్షకులు మాత్రం ఈ షో విషయంలో ఎందుకో కాస్త ఆసక్తి కనబర్చుతున్నట్లుగా లేరు అంటూ బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ సమయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. బిగ్ బాస్ కు వచ్చే రేటింగ్ లో ఎన్టీఆర్ షో కు వస్తున్న రేటింగ్ చాలా తక్కువ అన్నట్లుగా ఉందట. ఎన్టీఆర్ ఛరిష్మా వల్ల కొద్ది మంది అయినా చూస్తున్నారని... తెలుగు ప్రేక్షకులకు ఈ షో కాన్సెప్ట్ పెద్దగా నచ్చలేదేమో అంటూ అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముందు ముందు ఈ షో పబ్లిసిటీ విషయంలో జెమిని టీవీ కొత్తగా ఏమైనా చేసి రేటింగ్ పెంచుతారేమో చూడాలి. షో ను జనాల్లోకి బాగా తీసుకు వెళ్లడంలో జెమిని టీవీ విఫలం అయ్యిందనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.