ఇప్పటివరకు చాలా తెలుగు సినిమా విషయంలో.. చాలామంది పెద్ద స్టార్ల విషయంలో జరిగింది ఏంటంటే.. బడ్జెట్ కంట్రోల్ లో తీయకపోతే సినిమాలకు లాసులు తప్పట్లేదు. హిట్ టాక్ వచ్చిన తరువాత కూడా సినిమాలు చివర్లో ఒక కోటిని దాటలేకపోతున్నాయ్ అంటే దానర్ధం అదేగా మరి. అందుకే ఈ మధ్యన మహేష్ బాబు తన సినిమాలకు పారితోషకం తీసుకోకుండా.. ప్రొడ్యూసర్ గా మారిపోయి లాభాల్లో వాటాలు తీసుకుంటున్నాడు. ఒక విధంగా అదే కరక్టు పద్దతి.
ఇకపోతే ఇప్పటికే జూ.ఎన్టీఆర్ .. సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' నిర్మాణానికి చాలానే కర్చయ్యింది. ఎందుకంటే ఈ సినిమా కోసం దాదాను రెండు నుండి మూడు నెలలు లండన్ లోనే యునిట్ మకాం వేసింది. అయితే అక్కడకు చాలామంది యువ నటులను, చిన్న చిన్న ఆర్టిస్టులను రప్పించి.. షూటింగ్ చేసింది కేవలం నాలుగు రోజులే అయినా ఎక్కువ కాలం పాటు వారిని అక్కడ వెయిటింగ్ లో పెట్టడంతో ఖర్చు బాగానే అయ్యిందట. అందుకే ఇప్పుడు దానిని బర్తీ చేస్తున్నాడు యంగ్ టైగర్. స్పెయిన్ షెడ్యూల్ లేటవ్వడానికి కారణం ఏంటంటే.. అసలు సె్పయిన్ లో అవుట్ డోర్ లో తీయాల్సిన షాట్లు తప్పించి.. మిగిలిన ఇండోర్ వర్కంతా ఇప్పుడు సుకుమార్ తో ఇక్కడ హైదరాబాద్ లోనే చేయిస్తున్నారట.
సో.. ఎన్టీఆర్ కూడా బడ్జెట్ కంట్రోల్ మోడ్ లోకి వచ్చేశాడు. మహేష్ ను ఇన్సిపిరేషన్ గా తీసుకొని.. మన బడా స్టార్లందరూ ఇలా బడ్జెట్ ను కంట్రోల్ చేస్తే.. ఖచ్చితంగా బయ్యర్లందరూ ఫుల్ ఖుషీ అవుతారు.