ఒక స్టార్ హీరోకు బలం ఎప్పుడూ తన అభిమానులే. తమ అభిమాన హీరో సినిమాలను టాక్ తో సంబంధం లేకుండా చూసేస్తారు. ఇక ఆ సినిమా నచ్చిందంటే ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూసిందాకా వారికి నిద్ర పట్టదు. అసలు అభిమానులు ఎంతమంది ఉన్నారనేదాన్ని బట్టే స్టార్ హీరో రేంజ్ మనకు తెలుస్తుంది. స్టార్ హీరోలు కూడా తమ అభిమానుల పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు. కొందరితో స్టార్లకు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంటుంది. ఈమధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు కన్ను మూశారు. దీంతో ఎన్టీఆర్ దిగ్బ్రాంతికి లోనయ్యారు.
ఆ అభిమాని మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తనకు అత్యంత ఆప్తుడు.. కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అనే వార్త తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని తెలిపారు. "నా మొదటి సినిమా 'నిన్ను చూడాలని' తో ప్రారంభం అయిన మా ప్రయాణం ఇలా అర్థాంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదు. నేను కెరీర్లో ఎత్తుపల్లాలు చూసిన సమయంలో నా అభిమానులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు. అలా మొదటి నుంచి నాకు తోడుగా ఉన్న అభిమానులలో జయదేవ్ ముఖ్యమైన వారు. ఆయన లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను" అంటూ సంతాపం తెలిపారు.
జయదేవ్ మృతి విషయం తెలిసిన ఇతర ఎన్టీఆర్ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. జయదేవ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.