బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ కనిపిస్తాడో.. ఆ షోను ఎలా నడిపిస్తాడో చూడాలని ఆతృతగా చూస్తున్నారు అభిమానులు. ఐతే ఈ షోలో ఎన్టీఆర్ యాంకరింగ్ కే పరిమితం కాడట. అప్పుడప్పుడూ వేరే రకమైన ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాడట. అతను ఈ షోలో డ్యాన్స్ కూడా చేస్తాడట. స్వయంగా ఎన్టీఆరే ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘ప్రేక్షకులు ఇష్టపడే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. నా డ్యాన్స్ కూడా ఉంటుంది’’ అని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ షోలో మీ అబ్బాయి.. భార్య పాల్గొంటారా అని తారక్ ను అడిగితే.. ‘‘అభయ్ స్కూలుకి వెళ్తున్నాడు. మా ఆవిడ తన పనుల్లో బిజీ. వాళ్లీ షోకు వస్తారా అంటే ఇప్పుడేమీ చెప్పలేను’’ అని ఎన్టీఆర్ అన్నాడు.
ఇక ఈ షోలో పార్టిసిపెంట్ల గురించి చెప్పమంటే తనకే ఏ క్లూ లేదంటున్నాడు ఎన్టీఆర్. తాను కొందరిని ఈ షో కోసం రెకమండ్ చేశానన్న వార్తల్ని కూడా అతను ఖండించాడు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి ‘చార్లీస్ ఏంజెల్స్’లో చార్లీ ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఉండేది. కానీ అతనెప్పుడూ కనబడేవాడు కాదు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ షోలో పోటీదారులెవరో తెలుసుకోవాలనే ఆత్రుత ఉంది. రెండు వారాలుగా షో నిర్వాహకుల్ని ఈ విషయం అడుగుతున్నా. ఇప్పటివరకూ చెప్పలేదు. నాక్కూడా అందరిలాగే షో మొదలయ్యే రోజే తెలుస్తుందేమో. అలాగే షో నుంచి ఎలిమినేట్ అయ్యేవాళ్ల గురించి కూడా నాకు చెప్పరట. ఇక నేను ఈ షో కోసం కొందరిని రెకమండ్ చేయడమన్నది అవాస్తవం. ఇది సినిమా అయితే నిర్మాతతో మాట్లాడి ఫలానావాళ్లు బాగా చేస్తారని చెప్పొచ్చు. కానీ ఈ షో గురించి నాకే చాలా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఇంకెవరిని రికమండ్ చేయాలి’’ అని ఎన్టీఆర్ ప్రశ్నించాడు.