బాలకృష్ణ, ఎన్టీఆర్ దగ్గరవుతున్నారా?

Update: 2015-12-20 11:30 GMT
 నందమూరి వారి హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఆ కుటుంబంలోని మిగతావారికి సత్సంబంధాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. అదేసమయంలో బాలకృష్ణ అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లోనూ దూసుకెళ్తుండగా ఎన్టీఆర్ మాత్రం హిట్టు మొఖం చూడక చాలాకాలమైపోయింది. ఈలోగా చిరంజీవి ఇంటి నుంచి కొత్త హీరోలు పుట్టుకొస్తూ ఇండస్ట్రీలో సవాల్ విసురుతున్నారు. ఈ కారణాలన్నిటి వల్ల ఎన్టీఆర్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇంతకుముందులా టీడీపీ నాది... ఈ కుర్చీ నాది అంటూ చంద్రబాబును - లోకేశ్ ను రెచ్చగొట్టకుండా జాగ్రత్తగా బాబాయి బాలకృష్ణ ద్వారా మళ్లీ నందమూరి కుటుంబం అండ - టీడీపీ అండ సంపాదించుకుని ఇండస్ర్టీలో వస్తున్న భారీ అడ్డంకులను తట్టుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం తానే నాలుగు మెట్లు దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన ఇప్పటికే బాలకృష్ణకు దగ్గరవుతున్నారట.

బాలయ్య - జూనియర్ ఎన్టీఆర్‌ మధ్య గ్యాప్‌ తగ్గుతోందని సమాచారం. ఇందుకు ఎన్టీఆరే చొరవ తీసుకున్నారట. బాలయ్య - ఎన్టీఆర్‌ ల మధ్య ఒక పొలిటిషన్‌ రాజీ కుదిర్చినట్లు చెప్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ బాలయ్యకు ఫోన్ చేసి గతంలో జరిగిన పరిణామాలపై బాలయ్యకు సారీ చెప్పారట కూడా. అంతేకాకుండా ఒకే టైమ్‌ లో  రిలీజ్‌ కానున్న ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో - బాలకృష్ణ డిక్టేటర్ సినిమాల విషయంలో ఎన్టీఆర్ కాస్త వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. డిక్టేటర్‌ కోసం తన సినిమాను వారం పాటు వాయిదా వేస్తానని ఎన్టీఆర్‌ చెప్పినట్టు తెలుస్తోంది. తాజా పరిణామల నేపథ్యంలో ఎన్టీఆర్‌ మూవీ ఆడియో ఫంక్షన్‌కు బాలకృష్ణ కూడా వస్తారని తెలుస్తోంది. బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్‌ కు గ్యాప్ పెరిగిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్‌ కు కాస్త దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్‌ సినిమాల విషయంలో నెగిటివ్ ప్రచారానికి కూడా ఇదే కారణమని భావిస్తున్నారు. ఈ తరుణంలో వీరిద్దరూ కలిస్తే ఇద్దరికీ మంచిదే. మరి చంద్రబాబు ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News