టాక్ ఎలా ఉన్నా ‘జనతా గ్యారేజ్’ కలెక్షన్లకు ఢోకా లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో.. ఓవర్సీస్ లో ‘జనతా గ్యారేజ్’ అదరగొడుతోంది. అమెరికాలో ఈ సినిమా మూడు రోజుల్లోపే మిలియన్ డాలర్ల క్లబ్బులో అడుగుపెట్టడం విశేషం. రెండో రోజుకే 9.5 లక్షల డాలర్లు కొల్లగొట్టిన ఈ సినిమా మూడో రోజు మిలియన్ క్లబ్బులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఖాతాలోకి కొన్ని రికార్డులు చేరాయి. తెలుగులో వరుసగా మూడు సినిమాలకు అమెరికాలో మిలియన్ డాలర్లు.. నైజాంలో రూ.10 కోట్లు.. కర్ణాటకలో రూ.5 కోట్లు వసూలు చేసిన తొలి హీరోగా రికార్డు సృష్టించాడు జూనియర్ ఎన్టీఆర్.
టెంపర్.. నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్ సినిమాలకు తారక్ ఈ ఘనత సాధించాడు. మరే తెలుగు హీరోకూ ఈ రికార్డు లేదు. అంతే కాక అమెరికాలో మహేష్ బాబు తర్వాత వరుసగా హ్యాట్రిక్ మిలియన్ డాలర్ సినిమాలు అందించిన హీరో కూడా ఎన్టీఆరే. తారక్ ఖాతాలో మొత్తంగా 4 మిలియన్ డాలర్ మూవీస్ (బాద్ షా-టెంపర్-నాన్నకు ప్రేమతో-జనతా గ్యారేజ్) ఉన్నాయి. మరోవైపు సమంతకు అమెరికాలో ఇది 11వ మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. మూడో రోజుకే మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ‘జనతా గ్యారేజ్’.. ఫుల్ రన్లో ఈజీగా 2 మిలియన్ క్లబ్బులో అడుగుపెడుతుందని భావిస్తున్నారు. అదే సాధ్యమైతే ఎన్టీఆర్ కు.. కొరటాలకు ఇది వరుసగా రెండో 2 మిలియన్ డాలర్ల సినిమా అవుతుంది. తారక్ ‘నాన్నకు ప్రేమతో’.. కొరటాల ‘శ్రీమంతుడు’ ఆ క్లబ్బులో చేరాయి.