బింబిసార వేదిక నుండి పవన్‌ రికార్డ్‌ కు ఎసరు పెట్టిన ఎన్టీఆర్‌

Update: 2022-07-30 08:47 GMT
టాలీవుడ్ స్టార్‌ హీరోల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ మరే హీరోకు లేదంటారు.. ముఖ్యంగా సోషల్‌ మీడియా లో పవన్‌ కళ్యాణ్ కు దక్కిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. యూట్యూబ్‌ లో.. ట్విట్టర్ లో పవర్‌ స్టార్‌ అబిమానులు ఎన్నో రికార్డులను సృష్టించారు. పవన్ కళ్యాణ్ ఈమధ్య ఏ సినిమా ఈవెంట్‌ కు వెళ్తున్నా కూడా ఆ కార్యక్రమం యొక్క లైవ్‌ ను వేలల్లో చూస్తున్నారు.

భీమ్లా నాయక్‌.. వకీల్‌ సాబ్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పవన్ మాట్లాడుతున్న సమయంలో యూట్యూబ్‌ లో లైవ్  వ్యూస్ రికార్డు అంటూ అప్పుడు పవన్ అభిమానులు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు అదే స్థాయిలో బింబిసార ఈవెంట్‌ లో ఎన్టీఆర్‌ మాట్లాడుతున్న సమయంలో ఏకంగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్ అఫిషియల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ కు లక్ష మంది కనెక్ట్‌ అయ్యి చూశారు.

ఇతర ఛానల్స్ తో కలిపితే ఈ మొత్తం భారీగా ఉందని నందమూరి అభిమానులు అంటున్నారు. లైవ్ లో చూడటం మాత్రమే కాకుండా యూట్యూబ్‌ లో రికార్డెడ్‌ ఎన్టీఆర్‌ స్పీచ్‌ కూడా కేవలం 12 గంటల్లో మిలియన్  వ్యూస్ ను దక్కించుకుంది. లైక్స్ విషయంలో కూడా రికార్డులను నమోదు చేసింది.

ఇప్పటి వరకు ఏ హీరో స్పీచ్‌ కూడా ఇంత స్పీడ్ గా మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న దాఖలాలు లేవు అంటూ నందమూరి అభిమానులు గొప్పగా చెబుతున్నారు. బింబిసార సినిమా వసూళ్లు.. రికార్డులు.. ఫలితం ఏమో గాని ఆ సినిమా పేరుతో ఎన్టీఆర్ కు పవన్ కళ్యాణ్ రేంజ్ వ్యూస్ వచ్చి.. ఏకంగా పవన్‌ రికార్డ్‌ కు ఎసరు పెట్టే స్థాయిలో యూట్యూబ్‌ వ్యూస్ వచ్చాయని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంను శిల్ప కళా వేదిక లో నిర్వహించడం వల్ల కార్యక్రమం ను చూడ్డానికి వచ్చిన సగం మంది నందమూరి అభిమానులు బయటే ఉండాల్సి వచ్చింది. గతంలో పవన్‌ ఈవెంట్స్ కు ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌ కు ఆ స్థాయి అభిమాన గనం ఏర్పడిందని సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News