80ల్లో తెలుగు సినిమాల్ని ఫాలో అయిన వారికి ‘మండలాధీశుడు’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ ను అనుకరిస్తూ.. ఆయన్ని నెగెటివ్ గా చూపిస్తూ కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా ఎవరు చేయించారు.. ఎందుకు చేయించారు.. అన్న విషయాలు పక్కనబెడితే.. ఎన్టీఆర్ ను పోలిన పాత్రను పోషించినందుకు కోట శ్రీనివాసరావు మాత్రం చాలా ఇబ్బందులే పడ్డారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. అభిమానుల ఆగ్రహాన్ని చవిచూశారు. కేవలం తిట్లు శాపనార్థాలే కాదు.. దెబ్బలు కూడా తినాల్సి వచ్చిందట కోట అప్పట్లో. ఆ అనుభవం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోట వెల్లడించాడు.
‘‘‘మండలాధీశుడు విడుదలైన వెంటనే నేను ఎన్టీఆర్ గారిని అనుకరిస్తూ నటించానని అందరికీ తెలిసిపోయింది. దీంతో ఆయన అభిమానులు నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేను ఎక్కడ దొరుకుతానా అని ఎదురుచూస్తున్నారు. ఆ విషయం నా చెవిన కూడా పడింది. ఎందుకైనా మంచిదని నా జాగ్రత్తలో నేనున్నాను. అలాంటి సమయంలోనే రామారావుగారు బెజవాడలో ఓ కల్యాణ మంటపం ప్రారంభోత్సవానికి వెళ్లారు. అది పూర్తి చేసుకుని రైల్లో హైదరాబాద్‌కి ప్రయాణమయ్యారు. ఆయన రైలు ఎక్కే సమయానికే.. నేను హైదరాబాద్ నుంచి మరో రైల్లో బెజవాడ చేరుకున్నాను.
ఐతే ఎన్టీఆర్ ను చూడ్డానికి ఆయన అభిమానులు.. తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. నేను దిగక తప్పనిసరి పరిస్థితి రావడంతో ఎవరికంటా పడకుండా బయటపడదామనుకొని.. మెల్లగా జనంలో కలిసిపోయా. కానీ ఆయన అభిమానుల్లో ఒకడు నన్ను కనిపెట్టేశాడు. ‘రేయ్... అదిగోరా కోటగాడు’ అని కేక పెట్టేశాడు. జనం నన్ను చుట్టుముట్టేశారు. స్టేషన్ వెనక్కి నన్ను లాక్కెళ్లారు. నేనేం చెప్పినా వినిపించుకోలేదు. నా మీద తలో చెయ్యి వేశారు. నాతో వాదనకు దిగుతారని అనుకున్నా కానీ.. అలా కొట్టేస్తారనుకోలేదు. ఇంతలో ఎవరో వచ్చి జోక్యం చేసుకోవడంతో జనం నన్ను వదిలిపెట్టారు.
దీని తర్వాత అపార్థం తొలగించడానికి ఎన్టీఆర్ గారిని కలవాలనుకున్నా. కోపంతో ఆయన ఓ దెబ్బ కొట్టినా పర్వాలేదని ఆయన ఇంటికి వెళ్లాను. రామారావు గారి ముందుకెళ్లి ‘నమస్కారం సార్’ అని రెండు చేతులెత్తి దండం పెట్టా. ఆయన ఒక్క క్షణం పాటు ఎవరా అని చూసి.. ‘గుర్తుపట్టాం బ్రదర్. హౌ ఆర్ యు. విన్నాం మీ గురించి. చాలా మంచి యాక్టర్ అవుతున్నారని. ఆరోగ్యమే మహాభాగ్యం. చూశారు కదా మమ్మల్ని. ఎంత ఆరోగ్యంగా ఉన్నామో. కీప్ గుడ్ హెల్త్. గాడ్ బ్లెస్ యు’ అని భుజం తట్టారు. ఆయన కాళ్లకు దణ్ణం పెట్టి అక్కడి నుంచి వచ్చేశా. దీంతో భారం దిగిపోయింది’’ అని కోట నాటి సంగతుల్ని వెల్లడించారు.