ఆ హీరోయిన్ నే కావాలి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొత్త డిమాండ్‌

Update: 2022-05-27 09:30 GMT
ఇటీవ‌ల విడుద‌లైన `ఆర్ఆర్ఆర్‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకోవ‌డ‌మే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ నూ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.

ఇప్పుడీయ‌న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో అనౌన్స్ చేశాడు. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నాయి.

ప్ర‌స్తుతం కొర‌టాల ప్రీ ప్రొడెక్ష‌న్ వ‌ర్క్స్ తో బిజీగా ఉండ‌గా.. తార‌క్ ఈ మూవీ కోసం బ‌రువు త‌గ్గే ప‌నిలో ప‌డ్డాడు. ఇక ఈ సినిమా అనంత‌రం ఆయ‌న `కేజీఎఫ్‌` తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో ఓ మూవీ చేయ‌బోతున్నాడు. తార‌క్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ ప్రాజెక్ట్ ను  `ఎన్టీఆర్ 31` వ‌ర్కింగ్ టైటిల్ తో అధికారికంగా ప్ర‌క‌టించారు.

వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ ప‌ట్టాలెక్క‌నుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ తో క‌లిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన తార‌క్ ప్రీ లుక్ విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విష‌యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొత్త డిమాండ్ ను తెర‌పైకి తీసుకువ‌చ్చారు.

ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టినే హీరోయిన్ గా కావాల‌ని, ఎన్టీఆర్ కు జోడీగా ఆమెనే ఖ‌రారు చేయాల‌ని సోష‌ల్ మీడియా వేదిగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీ‌నిధి శెట్టి.. `కేజీఎఫ్` వంటి సెన్సేషనల్ మూవీతో సినీరంగ ప్ర‌వేశం చేసింది. తొలి చిత్రంతోనే సౌత్ తో పాటు నార్త్ లోనూ గుర్తింపు పొందింది.

అందుకే `ఎన్టీఆర్ 31`లో శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్ గా కావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.  మరి అభిమానులు ఆశించినట్టుగా ప్రశాంత్ నీల్.. తారక్ - శ్రీనిధి శెట్టిల కాంబినేషన్ ను సెట్ చేస్తాడా లేక‌ మ‌రో హీరోయిన్ ను దింపుతాడా అన్న‌ది చూడాలి. కాగా, ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో `స‌లార్‌` అనే మూవీ చేస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ కిరాగందుర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే ముప్పై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా ఫినిష్ చేసేందుకు ప్ర‌శాంత్ నీల్ ఇటీవ‌లె షూటింగ్ ను రీ స్టార్ట్ చేశారు.
Tags:    

Similar News