ప్రస్తుతం మన టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ కుదిరినప్పుడల్లా తమ మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తున్నారు. దాని కోసం వారి సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి దాకా అందరూ డబ్బింగ్ సినిమాలతో ప్రయత్నం చేశారు. రామ్ చరణ్ జంజీర్, ప్రభాస్ బాహుబలి చిత్రాలే దీనికి ఉదాహరణ. అయితే ఈ సినీమాలలో వారు డబ్బింగ్ ఆర్టిస్టుల మీద ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రం తన సొంత వాయిస్ తో ప్రయత్నం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌తో పాటు ఈ సినిమా టైటిల్ 'రౌద్రం రణం రుధిరం' అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత మరో విజువల్ ట్రీట్‌లా కనిపిస్తోంది. ఈ టీజర్‌కు ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ ఓ రేంజ్‌లో ఉంది.
తెలుగులోనే కాదు, హిందీలో తమిళంలో,కన్నడలో ఎన్టీఆరే తన వాయిస్ అందించాడు. మలయాళంలో మాత్రం వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు. ఒక పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కబోతున్న ఓ సినిమాకు హీరో ఇన్ని భాషల్లో ఓన్ డబ్బింగ్ చెప్పడం ఈ జనరేషన్‌లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. అంతేకాదు ఆయా భాషల్లో ఎన్టీఆర్ డైలాగ్ చెప్తూ ఎక్కడా తడబడలేదు. హిందీలో డైలాగ్స్ కోసం రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్ లో చెప్పేసాడంట. ఇప్పుడు మనం టీజర్ లో వింటున్న డైలాగ్ ఇదే. దీనికి ఫిదా అయిన రాజమౌళి హిందీలో కూడా పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ ని డబ్బింగ్ చెప్తే బాగుంటుందని సూచిస్తున్నాడట. ఒకవేళ ఎన్టీఆర్ అన్ని భాషల్లో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటే.. రామ్ చరణ్ కూడా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవాలని ఫ్యాన్స్ నుండి ప్రెజర్ పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఎన్టీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిందే.