యంగ్ టైగర్ తన ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా...?

Update: 2020-05-19 14:30 GMT
నందమూరి నట వారసుడు తారక రామారావు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచమయ్యాడు. ఆ తర్వాత 'రామాయణం' సినిమాతో బాల రాముడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'నిన్ను చూడాలని' అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నూనూగు మీసాల వయసులోనే 'స్టూడెంట్ నెంబర్ 1' 'ఆది' 'సింహాద్రి' సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ మూవీస్ కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 'బృందావనం' సినిమా తర్వాత తారక్ హిట్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 'టెంపర్' సినిమా నుంచి కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వైవిధ్యమైన పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా.. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరిగా నిలిచారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హీరోగా మొదటి సినిమాకి తీసుకున్న పారితోషికం ఎంత అనేది ఓ సందర్భంలో తెలియజేశారు.

ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ 'నిన్ను చూడాలని' సినిమాకి విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించగా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో నటించినందుకు తారక్ కేవలం 4 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారట. అప్పటికి టీనేజ్ కూడా దాటని ఎన్టీఆర్ కి ఆ నాలుగు లక్షలు ఏమి చేయాలో తెలియక తికమక పడ్డారట. మొదట ఇంట్లో రహస్య ప్రదేశాల్లో దాచిన తారక్ బాత్ రూమ్ లో కూడా దాచిపెట్టే ప్రయత్నం చేసాడట. ఆ తర్వాత కార్ లో దాచిపెట్టి.. చివరికి అది సేఫ్ ప్లేస్ కాదని అక్కడి నుంచి కూడా డబ్బు తీసేశాడట. చివరికి ఆ డబ్బును ఏం చేయాలో అర్థం కాక ఎన్టీఆర్ తన తల్లికి ఆ డబ్బులను గిఫ్ట్ గా ఇచ్చాడట. 4 లక్షల పారితోషకంతో కెరీర్ స్టార్ట్ చేసిన తారక్ ఇప్పుడు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకొనే రేంజ్ కి వచ్చేసాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తెలంగాణా విప్లవ వీరుడు 'కొమరం భీమ్' లో కనిపించనున్నాడు.
Tags:    

Similar News