యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు నాన్న కు ప్రేమతో షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి క్షణం తీరిక సమయం దొరకలేదు. ఫ్యామిలీతో ఎటు వెళ్లలేని పరిస్థితి. మేజర్ పార్టు షూటింగ్ అంతా స్పెయిన్ లో జరగడంతో ఎక్కువగా అక్కడే గడపాల్సి వచ్చింది. తర్వాత అన్నయ్య కల్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్ క హజరవ్వడం తర్వాత హడావుడి గా వెళ్లిపోవడం తప్ప భార్య - పిల్లలతో గడిపింది లేదు. అందుకే తారక్ ఇప్పుడు ఉన్న సమయాన్నే జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నాన్నకు ప్రేమతో షూటింగ్ పూర్తికాగానే వెంటనే కొరటాల శివ జనతా గ్యారెజ్ సెట్స్ కు వెళ్తుంది. అందుకే ఈ గ్యాప్ లోనే ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు.
అన్ని పనులు పూర్తిచేసి నాన్న కు ప్రేమతో చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 27న ఆడియో కార్యక్రమం ఉంది. అటు ఓపాటకు సంబంధించి ప్యాచ్ వర్క్ జరుగుతోంది. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తే అతనికి దొరికిన టైమ్ కేవలం రెండు వారాలు మాత్రమే. అందుకే ఈ గ్యాప్ ను సతీమణి ప్రణతి - కుమారుడు అభయ్ తో స్పెండ్ చేయాలనుకుంటున్నాడు. అందుకోసం విదేశాలు టూర్ ప్లాన్ చేశాడు. ఇటీవల మహేష్ బాబు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో సమయం దొరకడమే తరువాయి ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కేసేవాడు.