'బాహుబలి' సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా బాహుబలి అంటే ఇండియన్ మూవీ అన్నంతగా ఈ బాహుబలి సినిమాలు తమ సత్తా చాటాయి. 'బాహుబలి 1 - బాహుబలి 2' ఈ రెండు చిత్రాలు రిలీజ్ అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రదర్శింపబడుతూనే ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి సినిమా ఉత్సవాలు జరిగినా దానిలో బాహుబలి ప్రదర్శన అనేది కామన్ గా మారిపోయింది. అంత బలంగా బాహుబలి సినిమా అభిమానులను అలరించింది.
ఇప్పుడు అక్టోబర్ 19న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ద్వారా ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. ఈ సందర్భంగా బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ట్విట్టర్ లో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇంగ్లీష్ సినిమా కాకుండా వేరే భాష సినిమా అక్కడ ప్రదర్శించడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. లండన్ లో బాహుబలి చూడడానికి తాను వెళ్తున్నానని ప్రభాస్ కొద్ది రోజుల క్రితం ఒక వీడియో ద్వారా అభిమానులకు చెప్పాడు. ఈ ప్రదర్శన చూడడానికి రానా - రాజమౌళి - కీరవాణి లాంటి వాళ్ళు కూడా లండన్ వెళ్తున్నారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ ప్రదర్శనకి 'ఆర్ ఆర్ ఆర్' లో హీరోలుగా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కూడా వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలు కూడా ఈ ప్రదర్శనకు హాజరైతే అందరి దృష్టి తమ తర్వాతి సినిమా 'ఆర్ ఆర్ ఆర్' పై పడుతుందని, దాంతో ఈ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వస్తుందని అందుకే వీళ్ళు కూడా లండన్ వెళ్తున్నారని తెలుస్తుంది. అయితే కొంతమంది మాత్రం రెండు సినిమాలకు రాజమౌళి డైరెక్టర్ కావడంతో అతని కోరిక మేరకు వీళ్ళు లండన్ వెళ్తున్నారని అంటున్నారు.