'జై లవ కుశ' సినిమా టీజర్ ను చెప్పినట్లే 5.22 ని.షాలకు విడుదల చేశారు ఎన్టీఆర్ అండ్ టీమ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు రకాల పాత్రలను చేస్తున్నాడు కాబట్టి.. మనోళ్లు మూడు డిఫరెంట్ టీజర్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో తొలి వర్షన్ అయిన 'జై' కు సంబంధించిన టీజర్ ఇవాళ విడుదలైంది. ఇంతకీ ఎలా ఉంది?
ఇప్పటివరకు కేవలం హీరోగా నటించిన ఎన్టీఆర్.. ఏదో ఒక్క ఊసరవెల్లి సినిమాలో తప్పిస్తే.. అసలు పెద్దగా నెగెటివ్ షేడ్ ఉన్న క్యారక్టరే ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు తొలిసారిగా మనోడు పూర్తి స్థాయి విలన్ వేషాలు వేశాడు. ''ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ ధ ధ ధ ధైర్యం ఉండాలా'' అంటూ ఒకేసారి మనోడి కలిగించే భయాన్ని.. అలాగే తనకున్న నత్తిని పరిచయం చేశాడు దర్శకుడు. ఎన్టీఆర్ లుక్ పరంగా చూస్తే దమ్ము సినిమాలోని హీరో లుక్ తరహాలో ఉంది కాని.. డైలాగ్ డెలివరీపరంగా ఇంప్రెసివ్ గానే ఉంది.
ఇకపోతే హీరోలను ఎలాంటి బిల్డప్స్ ఇచ్చిన చూపించాలో దర్శకుడు కె.ఎస్.రవీంద్ర బాగానే కాచి వడపోచినట్లున్నాడు. అందుకే విలన్ ను కూడా అంతకంటే బల్డప్ తో బాగా చూపించేశాడు. ఈ క్యారక్టర్ వరకు ఇంప్రెసివ్ అయినా కూడా.. మరి కథలో కూడా బాబీ ఆ టాలెంట్ చూపించాలి. లేదంటే ఎన్టీఆర్ నట విశ్వరూపం వేస్టయ్యే ఛాన్సుంది. చోటా కె నాయుడు గతంలో మనోడ్ని బృందావనం.. రామయ్య వస్తావయ్యా సినిమాల్లో ఎలాగైతే ఎలివేట్ చేసి బాగా చూపించాడో.. ఇక్కడ కూడా అదే చేశాడు. ఇకపోతే కళ్యాణ్ రామ్ పెడుతున్న ఖర్చు టీజర్లో దర్శనమిస్తోందండోయ్.
Full View