#RRR: చెర్రీ క‌న్నా ఎన్టీఆరే ముంద‌ట‌!

Update: 2018-07-07 16:46 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న `ఆర్ ఆర్ ఆర్ ` చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి - మెగా ఫ్యామిలీలకు చెందిన యంగ్ హీరోలు తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనుండ‌డంతో వారి ఫ్యాన్స్ ...ఈ సినిమా ఎపుడెపుడు సెట్స్ పైకి వస్తుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో....ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ నవంబర్  నుంచి ప్రారంభం కాబోతోంద‌ని తెలుస్తోంది. అయితే, ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ ముందుగా పాల్గొంటాడ‌ని....ఆ త‌ర్వాత చెర్రీకి సంబంధించిన స‌న్నివేశాలు షూట్ చేస్తార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ త‌ర్వాత షెడ్యూల్ లో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సీన్ల‌ను షూట్ చేయ‌బోతున్నార‌ట‌.

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తోన్న `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` చిత్రం షూటింగ్ లో ఎన్టీఆర్ - బోయ‌పాటి సినిమా షూటింగ్ లో చెర్రీ బిజీగా ఉన్నారు. దీంతో, వీరిద్ద‌రి డేట్స్ ఒకే సారి దొర‌క‌డం క‌ష్టం. కాబ‌ట్టి, ముందుగా ఒక హీరోకి సంబంధించిన సన్నివేశాలను...త‌ర్వాత మరో హీరోకి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయాల‌ని రాజమౌళి ప్లాన్ చేశార‌ట‌. నవంబర్ నుంచి ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలు పెట్ట‌బోతున్నార‌ని..... డిసెంబర్ నుంచి చెర్రీకి సంబంధించిన సీన్స్ షూట్ చేయ‌బోతున్నార‌ని టాక్ వ‌స్తోంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ ను కూడా జ‌క్క‌న్న రెడీ చేశార‌ట‌. మ‌రి, ఈ సినిమాలో చెర్రీ - ఎన్టీఆర్ ల స‌ర‌స‌న హీరోయిన్లుగా ఎవ‌రు ఎంపిక‌వుతార‌న్న విష‌యంపై ఆస‌క్తి  నెల‌కొంది.
Tags:    

Similar News