యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జక్కన్న నుంచి తారక్ కి క్లియరెన్స్ వచ్చేసింది కాబట్టి తన కొత్త సినిమాని ప్రారంభించేందుకు తారక్ సిద్ధమవుతున్నారు. కొరటాల శివ కూడా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే ఆచార్య చిత్రీకరణ పూర్తి చేసిన ఆయన తదుపరి తన మిత్రుడు ఎన్టీఆర్ తో సినిమా కోసం ఆత్రంగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
అందుకే అతి త్వరలో ఎన్టీఆర్ తో తన సినిమాను ప్రారంభించాలని నిర్ణయించారని తెలిసింది. కానీ ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో డిసెంబర్ నెలాఖరు వరకు చిత్రీకరణలో జాయిన్ కాలేడు. అందుకే ఎన్టీఆర్ ను పక్కనపెట్టి షూటింగ్ ప్రారంభించాలని కొరటాల నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సపోర్టింగ్ తారాగణంతో సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాడని సమాచారం.
`జనతా గ్యారేజ్` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించనున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలున్నాయి. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా తారక్ తనని తాను ఆవిష్కరించుకుంటున్నారు. అందువల్ల అతడి మార్కెట్ రేంజుకు తగ్గట్టే కొరటాలతో సినిమా కాన్వాస్ మారుతుందని భావిస్తున్నారు. ఈసారి తారక్ తో సోషియో పొలిటికల్ మూవీని తెరకెక్కించేందుకు కొరటాల ప్రయత్నిస్తున్నారని తెలిసింది.