తార‌క్ తో మూవీని స్కిప్ చేసిన కొర‌టాల‌!

Update: 2022-04-24 15:31 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాపై న‌లుగుతోన్న స‌స్పెన్స్ గురించి తెలిసిందే. ఈ సినిమా విష‌యంలో తార‌క్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌హ‌నం వ్యక్తం చేసిన తీరు చ‌ర్చ‌నీయాంశంగాను మారింది. తార‌క‌పై ఎంది భ‌య్యా అంటూ  అభిమానులే గుసాయించారు. ప్రాజెక్ట్ బాగా ఆలస్యం  కావ‌డంతోనే  అభిమానులు ఇలా ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

`ఆర్ ఆర్ ఆర్` సినిమా రిలీజ్ కాగానే కాంబినేష‌న్ ప‌ట్టాలెక్కుతుంద‌ని అంతా భావించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఆ స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఈ గ్యాప్ లో `ఆచార్య` రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో కొరటాల ఆ సినిమా ప‌నుల్లో బిజీ అయ్యారు. రోజూ ఇంట‌ర్వ్యూల‌తో బిజీగా గడుపుతున్నారు. `ఆచార్య` ప్ర‌మోష‌న్ లోనైనా తార‌క్ 30 అప్ డేట్స్ అందుతాయ‌ని అభిమానులు ఆశించారు.

కానీ అక్క‌డా భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఓ ఇంట‌ర్వ్యూలో తార‌క్ సినిమా గురించి  కొరటాల‌ని అడిగితే  దాని గురించి త‌ర్వాత మాట్లాడుదాం అని స్కిప్ చేసారు. ఇప్పుడు ఓన్లీ `ఆచార్య` త‌ప్ప ఇంకే సినిమా టాపిక్ వ‌ద్ద‌నేసారు. అయితే ఆఫ్ ది రికార్డులో ఒక నెల రోజులు తార‌క్ సినిమా ప్రారంభం అవుతుంద‌న్న విష‌యాన్నికొర‌టాల రివీల్ చేసిన‌ట్లు స‌మాచారం.

అయితే ఇదే విష‌యాన్ని కొర‌టాల మైక్ ల  ముందు చెప్పి ఉంటే అభిమానులు సంతోషంగా ఫీల‌య్యేవారు. కానీ  ఆఫ్ ది రికార్డు కాబ‌ట్టి ఆ స‌మాచారాన్ని ధృవీక‌రించ‌డానికి వీలు లేదు. దీంతో మ‌రోసారి ఎన్టీఆర్ అభిమానులు నిరుత్సాహాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే `ఆచార్య` రిలీజ్ అయ్యే వ‌ర‌కూ  కొర‌టాల‌కు ఈ ర‌క‌మైన ఇబ్బంది ఎక్క‌డికి వెళ్లినా త‌ప్ప‌దు. ఆయ‌న తో నిర్వ‌హించే ప్ర‌తీ చిట్ చాట్ లో తార‌క్ సినిమా ప్ర‌స్తావ‌న క‌చ్చితంగా వ‌స్తుంది.

ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్` స‌క్సెస్ త‌ర్వాత `ఆచార్య‌`లో సిద్ద  పాత్ర‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి ఈనెల 29న ప్రేక్ష‌కు ముందుకు వ‌స్తుండ‌టంతో తార‌క్ అభిమానులు ఒకింత జెల‌స్సీ ఫీల‌వుతున్నట్టు తెలుస్తోంది. తార‌క్ వెనుక‌బ‌డి..చ‌ర‌ణ్ ముందుకెళ్లిపోతున్నాడని  అభ‌ద్ర‌తా భావాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. మ‌రి `ఆచార్య` రిలీజ్ అయి సిద్ద పాత్ర తిరుగులేద‌ని టాక్ వ‌స్తే ప‌రిస్తితి ఏంటో. చిరు- కొర‌టాల  వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి రామ్ చ‌ర‌ణ్ పాత్ర తెర‌పై చాలా సేపు క‌నిపించే అవ‌కాశం ఉంద‌నిపిస్తుంది.
Tags:    

Similar News