రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనాలకు కేంద్ర బిందువు. సినిమాలో గానీ, రియల్ లైఫ్‌లో గానీ తాను చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పేయటం ఈయన స్టైల్. అది ఎన్ని విమర్శలకు దారితీసినా అస్సలు పట్టించుకోరు వర్మ. ఎప్పుడైతే బాలయ్యబాబు ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిస్తానని ప్రకటించారో అప్పుడే రంగంలోకి దిగారు ఈ వివాదాస్పద వీరుడు. తాను కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని, తాను తీయబోయే బయోపిక్కే పైనున్న ఎన్టీఆర్‌కి నచ్చుతుందని ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో షూటింగ్ మొదలుపెట్టి.. చిత్రంలోని రెండు పాటలను విడుదల చేశారు. ‘‘వెన్నుపోటు, ఎందుకు’’ అంటూ వచ్చిన ఈ రెండు పాటలు.. ఓ వైపు ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తూనే మరోవైపు వివాదాలకు బాటలు వేశాయి. ఇదిలా ఉండగానే జనవరి 18వ తేదీ.. ఎన్టీఆర్ వర్థంతి రోజున ఆయన మళ్లీ పుట్టబోతున్నారని చెప్పి మరో సంచలనానికి తెరలేపారు వర్మ. దీంతో ఈ సారి వర్మ ఎలాంటి బాంబ్ పేల్చబోతున్నారా? అని ఆసక్తిగా ఎదురు చూశారు ప్రేక్షకులు.
తాజాగా ఆ ఆసక్తిని తెరదించుతూ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ఎన్టీఆర్ లుక్ బయటకు వదిలారు వర్మ. ఓ వీడియో రూపంలో తన సినిమాలోని ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసి ఆశ్చర్యపోవటం ప్రేక్షకుల వంతైంది. వర్మ చెప్పినంత పని చేసేశాడే! అని ముక్కున వేలేసుకున్నారంతా. ఇందులో కనిపిస్తున్న నటుడు అచ్చం ఎన్టీఆర్ లాగే ఉండటమే ఇందుకు కారణం. దీనికి తోడు ‘‘ఎన్టీఆర్ మృతి చెందిన తర్వాత.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో మళ్లీ పుట్టారు’’ అని వర్మ పెట్టిన క్యాప్షన్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా విడుదల చేసిన ఈ వీడియోతో వర్మ రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాత కావటం గమనార్హం. లక్ష్మీపార్వతిగా కన్నడ నటి యజ్ఞాశెట్టి, చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సోదరుడు కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు
Full View