`మ‌హానాయ‌కుడు` ఫైన‌ల్‌ క‌లెక్ష‌న్స్‌

Update: 2019-03-07 06:25 GMT
బ‌యోపిక్ ల ట్రెండ్ లో మ‌హానటి సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 80కోట్ల వ‌సూళ్లు సాధించ‌డంతో అది మ‌న మేక‌ర్స్ లో కొత్త ఆశ‌లు రేకెత్తించింది. ఆ వెంట‌నే నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ ని ప్ర‌క‌టించారు. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌తో క‌థానాయ‌కుడు, మ‌హానాయకుడు చిత్రాల్ని తెర‌కెక్కించారు. ఈ సినిమాల్లో తొలి భాగం క‌థానాయ‌కుడు సంక్రాంతి బ‌రిలో రిలీజై డిజాస్ట‌ర్ ఫ‌లితం అందుకోవ‌డం మింగుడుప‌డ‌నిది. అటుపై మ‌హానాయ‌కుడు చిత్రంపై ఆశ‌లు పెట్టుకున్నా అంతిమంగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. తాజాగా మ‌హానాయ‌కుడు ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్ రిపోర్ట్ అందింది. వ‌ర‌ల్డ్ వైడ్ 4.30 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం.

తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. మ‌హానాయ‌కుడు వ‌ర‌ల్డ్ వైడ్ ఫైన‌ల్ షేర్ వివ‌రాలివి. నైజాం- 0.87 కోట్లు, సీడెడ్‌- Rs 0.51 కోట్లు, తూ.గో జిల్లా -0.22 కోట్లు, ప‌.గో.జిల్లా - 0.19 కోట్లు, గుంటూరు- 0.71 కోట్లు, కృష్ణ‌- 29ల‌క్ష‌లు, నెల్లూరు -14ల‌క్ష‌లు, ఇత‌ర ఇండియా- 40ల‌క్ష‌లు, ఓవ‌ర్సీస్ -70ల‌క్ష‌లు, అమెరికా- 31 ల‌క్ష‌లు, ఓవరాల్ గా 4.34 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అంటే మ‌హానాయ‌కుడు ఫెయిల్యూర్ అని తేలిపోయింది.

ఈ ఫ‌లితం మ‌న ఫిలింమేక‌ర్స్ కి ఓ గుణ‌పాఠం అనే ట్రేడ్ చెబుతోంది. బ‌యోపిక్ ట్రెండ్ లో ఆచితూచి అడుగు వేయాల‌ని ఈ ఫ‌లితం చెబుతోంది. ప్ర‌జ‌ల్లో ఆసాధార‌ణ పాపులారిటీ .. క‌రిష్మా ఉన్న నాయ‌కుడు, క‌థానాయ‌కుడు జీవిత‌క‌థ తీసినా ఆద‌రించ‌క‌పోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌న ఫిలింమేక‌ర్స్ క‌థల ఎంపికపై ఎంతో జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు క్రిటిక్స్ ప్ర‌శంస‌ల‌కు భిన్న‌మైన ఫలితం అందుకోవ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మరోవైపు వైయ‌స్సార్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిన `యాత్ర‌` ఫ‌లితంపైనా క్రిటిక్స్ లో చ‌ర్చ సాగింది. ప‌రిమిత బ‌డ్జెట్ తో తెర‌కెక్కించి నిర్మాత‌లు గ‌ట్టెక్కారు కానీ, లేదంటే భారీ న‌ష్టాలు చ‌వి చూసేవారేనన్న విశ్లేష‌ణా సాగుతోంది.


Tags:    

Similar News