'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దాంతో 'ఎన్టీఆర్ మహానాయకుడు'కు కూడా అదే పరిస్థితి అని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ హడావుడి చేస్తున్న నేపథ్యంలో మహానాయకుడు చిత్రాన్ని పట్టించుకునే నాధుడే ఉండడేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 'మహానాయకుడు' సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించడంతో పాటు, ఆసక్తిని కలిగిస్తుంది.
కథానాయకుడు సినిమా సింపుల్ గా సాగిపోయింది. కాని మహానాయకుడు సినిమా మాత్రం నాదెండ్ల ఎపిసోడ్ తో హీట్ ఎక్కించేలా కనిపిస్తోంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు పాత్రలో రానా ఆకట్టుకుంటాడని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడును ప్రతిపక్షాలు మామకు వెన్ను పోటు పొడిచాడు అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో 'మహానాయకుడు' చిత్రంతో ఆ మరకను కొంతలో కొంత అయినా పోగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
నాదెండ్ల ఎపిసోడ్ సమయంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు ఎంత మద్దతుగా నిలిచాడు, ఆ సమయంలో ఎన్టీఆర్ ను తిరిగి అధికార పీఠంలో కూర్చోబెట్టడంలో చంద్రబాబు పోషించిన పాత్ర ఏంటీ అనేది మహానాయకుడు చిత్రంలో చూపించబోతున్నారు. ఎన్టీఆర్ పై అపారమైన గౌరవం చూపించే వ్యక్తిగా మహానాయకుడు చిత్రంలో చంద్రబాబును చూపించబోతున్నారు.
కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చిందే తప్ప ఎన్టీఆర్ కు మామ అంటే చాలా గౌరవం అనేది ఈ చిత్రంలో చూపించనున్నట్లుగా తెలుస్తోంది. ఒక వైపు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బాబును విలన్ గా చూపిస్తే, మహానాయకుడులో బాబును హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రేక్షకులు బాబులో విలన్ ను చూస్తారా, హీరోను చూస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.