పుష్కర కాలం తర్వాత ఎన్టీఆర్‌ మూవీ విడుదల

Update: 2019-11-20 06:28 GMT
సరిగ్గా పుష్కర కాలం అంటే 12 ఏళ్ల క్రితం 'యమదొంగ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ యముడిగా నటించి మెప్పించాడు. సినిమా సరికొత్త సెన్షేషన్‌ గా నిలిచింది. అంతకు ముందు కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్‌ దారుణమైన డిజాస్టర్స్‌ ను చవి చూశాడు. ఎన్టీఆర్‌ కెరీర్‌ ఖతం అంటూ కొందరు విమర్శలు కూడా చేశారు. ఎన్టీఆర్‌ మరీ అధికంగా బరువు పెరగడంతో పాటు.. వరుసగా వస్తున్న ఫ్లాప్‌ ల కారణంగా ఆయన కెరీర్‌ పై నీలినీడలు కమ్ముకున్న సమయంలో వచ్చిన యమదొంగ సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌ కు జీవం పోసి మళ్లీ అక్కడ నుండి వెనుదిరిగి చూడకుండా చేసింది.

ఆ సమయంలో తెలుగు సినిమాలకు తమిళంలో మరియు ఉత్తరాదిన పెద్దగా మార్కెట్‌ లేదు. కనుక అప్పట్లో యమదొంగ సినిమాను డబ్బింగ్‌ చేయలేదు. ఇప్పుడు తమిళంలో విజయన్‌ గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమౌళికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ ఉంది. రాజమౌళి పేరు చెప్పి ఈ సినిమాను ప్రస్తుతం అక్కడ పబ్లిసిటీ చేస్తున్నారు. రాజమౌళి సినిమా అవ్వడంతో ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్‌ రావడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా తమిళ డబ్బింగ్‌ హక్కులు కొనుగోలు చేసిన బయ్యర్లు నమ్మకంగా ఉన్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ కు తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉంది. దాంతో పాటు ఈ చిత్రంలో హీరోయిన్స్‌ గా నటించిన ప్రియమణి మరియు మమతా మోహన్‌ దాస్‌ లు తమిళ ప్రేక్షకులకు సుపరిచితులే. రాజమౌళికి మంచి పేరుంది. ఇన్ని కారణాల నేపథ్యంలో యమదొంగ తమిళ వర్షన్‌ విజయన్‌ తప్పకుండా అక్కడ మెప్పిస్తుందని.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందని టాక్‌ వినిపిస్తుంది. యమదొంగ సక్సెస్‌ అయితే ఎన్టీఆర్‌ పాత సినిమాలన్నీ కూడా తమిళనాడుకు క్యూ కట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News