ఎన్టీఆర్ మళ్లీ మొత్తం మార్చేస్తున్నాడు

Update: 2016-12-09 02:18 GMT
కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో.. యమదొంగ సినిమాకు ఎలా తయారయ్యాడో తెలిసిందే. ఆ తర్వాత రెండేళ్ల కిందట ‘టెంపర్’ సినిమాకు మేకోవర్ చూపించాడు తారక్. ఏడాది తిరిగేసరికి ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు మళ్లీ అవతారం పూర్తిగా మార్చేశాడు జూనియర్. అందులో తారక్ లుక్ ట్రెండ్ సెట్టర్ అయింది. ఎన్టీఆర్ అలాంటి అవతారం చూస్తారని కొన్నేళ్ల కిందటి వరకు ఎవరూ ఊహించలేదు. ముందు ఆడ్ గా అనిపించినా.. ఆ తర్వాత ఆ లుక్ కు జనాలు బాగానే అలవాటు పడ్డారు. ఇష్టపడ్డారు. ఇప్పుడు మరోసారి తారక్.. సరికొత్త లుక్ తో జనాలకు షాకివ్వబోతున్నట్లు సమాచారం.

బాబీ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా అవతారం మార్చేస్తున్నాడట. అతను ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తాడట. ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ తర్వాత మూడు నెలలు ఖాళీగా ఉన్న తారక్.. కొంచెం సన్నబడి.. గడ్డం బాగా కనిపించి.. ఈ మధ్య ఓ వేడుకలో వైవిధ్యమైన అవతారంలో కనిపించి జనాలకు షాకిచ్చాడు. ఐతే ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతోనూ అలా తయారవలేదు. గడ్డం పెంచితే.. సినిమాకు తగ్గట్లుగా మార్చుకుందామనుకున్నాడు. ఇప్పుడు ఒక స్టైలిస్టుని పెట్టుకుని.. దర్శకుడి ఆలోచనలకు తగ్గట్లుగా ఒక కొత్త లుక్ ను తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడట తారక్. ఈ సినిమా కోసం తారక్.. మళ్లీ కొంచెం సన్నబడనున్నట్లు కూడా తెలిసింది. మరి ప్రారంభోత్సవం రోజు ఎన్టీఆర్ ఎలా ఉంటాడో.. సినిమా సెట్స్ మీదికి వెళ్లాక ఎలా కనిపిస్తాడో చూద్దాం.
Tags:    

Similar News