యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో ఎందుకనో సైలెంట్ గా ఉన్నారు. ఇంతకుముందులా కథలు వినే హడావుడి లేనేలేదు. వరుసగా స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నా ఎవరికీ ఓకే చెప్పడం లేదు. అలాగని నో చెప్పనూ లేదు. ఒక్క ఆర్.ఆర్.ఆర్ తప్ప ఇంకేదీ తన ఖాతాలో పడనేలేదేమిటో! అసలింతకీ తారక్ మైండ్ లో ఏం ఉంది? 2020 ప్లానింగ్స్ ఏమిటి? అన్నది ఇప్పటికి సస్పెన్స్ గా మారింది.
ఇప్పటికే తారక్ లిస్ట్ లో ఇద్దరు టాప్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. వరుస హ్యాట్రిక్ లతో చెలరేగుతున్న తమిళ యువదర్శకుడు అట్లీ కుమార్ ... సంచలనాల కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అట్లీతో వైజయంతి మూవీస్ .. ప్రశాంత్ నీల్ తో మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. వాళ్లతో కథల్ని వండిస్తున్నారు. అయితే తారక్ నుంచే ఇప్పటివరకూ ఏదీ కన్ఫామ్ కాలేదు.
అసలు తారక్ ఎవరినీ పట్టించుకోకుండా పూర్తిగా RRRపైనే దృష్టి సారించడం వల్లనే ఈ పరిస్థితి. 2020 జూలై 30 తర్వాతే నెక్ట్స్ ఏది అన్నదానిపై ఎన్టీఆర్ ఆలోచిస్తారట. భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ టెన్షన్స్ మాత్రమే అతడికి కనిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి రిలీజైతే కానీ రిలాక్స్ కాలేడట. అప్పటివరకూ కొత్త సినిమాకి సంతకం చేయనని దర్శకనిర్మాతలకు ముందే చెప్పేసాడు. జూలై 30 తర్వాతనే ఇక ఎవరైనా యంగ్ యమను కలవాల్సి ఉంటుంది.