ఓ కమర్షియల్ సినిమా సోషల్ లైఫ్ పై ప్రభావం చూపదలదని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. మంచి చెడూ రెండు యాంగిల్స్ లోనూ సినిమా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అదే కమర్షియల్ మూవీతో ఓ మంచి మెసేజ్ ఇవ్వగలిగితే.. దాని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రూవ్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. మిర్చి - శ్రీమంతుడుల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కి సమానంగా మెసేజ్ ను డీల్ చేసిన ఈ దర్శకుడు.. జనతా గ్యారేజ్ లో కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు.
మొక్కలను కాపాడేందుకు ఎంతకైనా తెగించే హీరో అనే కాన్సెప్ట్ ను జనతా గ్యారేజ్ లో చూపించబోతున్నారని ట్రైలర్ లోనే రివీల్ చేసేశారు. ఎన్టీఆర్ ఈ పాత్రలో విశ్వరూపం చూపించబోతున్నాడని ఇప్పటికే అర్ధమైపోయింది. మరి ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఓ సోషల్ మెసేజ్ ని పాస్ చేస్తే.. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడే కనిపిస్తోంది. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే.. సోషల్ నెట్ వర్క్ లో జనతా గ్యారేజ్ ఛాలెంట్ హ్యాష్ ట్యాగ్ చక్కర్లు కొట్టేస్తోంది.
జనతా గ్యారేజ్ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మనసులోని ఆలోచనే ఈ జనతాగ్యారేజ్ ఛాలెంచ్. చిన్నచిన్న మొక్కలను పాతిపెట్టి ప్రకృతికి మేలు చేయడం దీని ఉద్దేశ్యం. ఐస్ బకెట్ ఛాలెంట్.. రైస్ బకెట్ ఛాలెంజ్ లాంటి వాటి తర్వాత.. ఈ జనతా గ్యారేజ్ ఛాలెంజ్ కచ్చితంగా అందరినీ అటువైపు ప్రేరేపించేదే. తమ సినిమాతో ఇలాంటి మంచి పనికి ఊపిరిలూదిన జనతా గ్యారేజ్ యూనిట్ ని అభినందించాల్సిందే.