2 మిలియన్స్ కోసం ‘గ్యారేజ్’ ప్లాన్స్

Update: 2016-09-10 06:14 GMT
అమెరికాలో తెలుగు సినిమాల వ్యవహారం వేరుగా ఉంటుంది. అక్కడ డిమాండును బట్టి సప్లై అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. ప్రేక్షకుల్లో ఓ సినిమాపై ఎంత ఆసక్తి ఉందన్నదాన్ని బట్టి అక్కడ ఓ సినిమాను రిలీజ్ చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. థియేటర్లను కేటాయించడం.. ప్రిమియర్లు వేయడం కూడా దీన్ని బట్టే ఉంటుంది. అలాగే టికెట్ల ధరలు కూడా డిమాండును బట్టే నిర్ణయిస్తారు. క్రేజుకు తగ్గట్లే రేట్లు ఉంటాయి.

ప్రిమియర్ షోలకు భారీ రేట్లు పెట్టి.. రెగ్యులర్ షోలకు తగ్గించే బయ్యర్లు.. వారం తర్వాత రేట్లు తగ్గించి ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు. ఫస్ట్ వీకెండ్లో పెద్ద సినిమాలకు 20 డాలర్లకు పైనే ఉంటుంది రేటు. ఐతే అంత పెట్టి సినిమా చూడ్డానికి ఇష్టపడని ఆడియన్స్.. సెకండ్ వీక్ వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు రేటు ఆటోమేటిగ్గా 12 డాలర్లకు తగ్గుతుంటుంది. ఇలా రేటు తగ్గించడం ద్వారా ఎక్కువమంది ప్రేక్షకుల్ని ఆకర్షించి ఆక్యుపెన్సీ పెంచుకోవడం ద్వారా ఆదాయం కూడా బాగుండేలా చూసుకుంటారు.

తాజాగా ‘జనతా గ్యారేజ్’ను అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసిన ఫికస్ సంస్థ కూడా అలాగే చేసింది. రెండో వీకెండుకి టికెట్ల రేట్లు తగ్గించి 12 డాలర్లుగా నిర్ణయించింది. దీంతో వీకెండ్ లో ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా 1.65 మిలియన్ల దాకా వసూలు చేసింది. టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల కలెక్షన్లు పెరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి 2 మిలియన్ మార్కును చేరడం ఈజీ అయింది. వీకెండ్ అయ్యేసరికి యుఎస్ కలెక్షన్లు 1.9 మిలియన్లకు చేరుతాయని భావిస్తున్నారు. తర్వాతి వీకెండ్ కూడా పెద్ద సినిమాలేమీ లేవు కాబట్టి.. ఆ వీకెండ్లో ‘గ్యారేజ్’ బండి నడిస్తే 2 మిలియన్ మార్కును దాటి.. అమెరికాలో ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Tags:    

Similar News