రిజల్టు ఎఫెక్ట్‌ తారక్‌ మీద పడకూడదు

Update: 2015-11-17 22:30 GMT
చాలామంది దర్శకులు ఒక్క ఫ్లాప్‌ వస్తే తట్టుకోలేరు. అదీ ఎంతో కష్టపడి చాలా పెద్ద క్యాస్టింగ్‌ తో సినిమా చేస్తే.. అది వర్కవుట్‌ కాకపోతే.. వారికి రికవరీ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. ఎప్పుడూ చలాకీగా ఎంతో కూల్‌ గా ఉండే వినాయక్‌ నే చూడండి. మనోడు అఖిల్‌ రిజల్టు తారుమారు అవ్వగానే చాలా ఢీలా పడిపోయాడు. ఇప్పుడు ఏకంగా రెండు నెలల బ్రేక్‌ అడిగేశాడు.

ఇక వివి వినాయక్‌ దగ్గర అసోసియేట్‌ గా పనిచేసి సుకుమార్‌ పరిస్థితేంటంటే.. ఈయన 1 నేనొక్కడినే సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు అసలు ఓ 3 నెలలు బయటకే రాలేదు. స్వయంగా మహేష్‌ బాబే మళ్లీ ఈయన్ను మామూలు లోకంలోకి తేవాల్సి వచ్చింది. దానికితోడు ఏ హీరో కూడా ఈయన కథను ఒప్పుకోకపోవడంతో ఇంకా దిగులు చెందాడు. ఫైనల్‌ గా ఎన్టీఆర్‌ తో నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మధ్యలో ఉండగా.. ఇప్పుడు తన ప్రొడక్షన్‌ వెంచర్‌ అయిన కుమారి 21 ఎఫ్‌ రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమా కనుక తేడా పడితే పరిస్థితేంటి?

సినిమా రిజల్టు ఎలా ఉన్నా కూడా.. సుకుమార్‌ ఢీలా పడి ఆ ఎఫెక్టు మాత్రం 20వ తారీఖు నుండి స్పెయిన్‌ లో కొత్త షెడ్యూల్‌ మొదలు పెట్టుకోబోతున్న నాన్నకు ప్రేమతో సినిమాపై మాత్రం చూపకూడదు. అనవసరంగా మధ్యలో తారక్‌ ఇరుక్కుపోయాడే అనే టాక్‌ వినిపిస్తోంది కాని.. కుమారి 21 ఎఫ్‌ తో నిర్మాతగా హిట్టు కొట్టి ఆ ఊపులో సుకుమార్‌ ఎన్టీఆర్‌ సినిమాను ఇంకా అదిరిపోయేలా తీస్తాడని ఆశిద్దాం.
Tags:    

Similar News