2001లో "నిన్ను చూడాలని" సినిమాతో తెలుగు తెరకు పూర్తిస్థాయి హీరోగా పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్.. నాటి నుంచి నేటి జనతాగ్యారేజ్ వరకూ సినిమా విజయాలు, అపజయాలతో ఏమాత్రం సంబందం లేకుండా అతని కెరీర్ ముందుకు సాగిపోతుంది. కాసేపు.. ఎన్టీఆర్ టాలీవుడ్ నెం.1 హీరోయేనా - ఎన్టీఆర్ సినిమాల్లో హిట్ సినిమాల శాతం ఎంత? హైఎస్ట్ గ్రాస్ ఎంత? అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏది? అనే విషయాలు కాసేపు పక్కనపెడితే.. ఒక నటుడిగా ఈ బుడ్డోడు ఎప్పుడూ మంచి మార్కులే సంపాదించాడు.
అయితే ఇప్పటివరకూ జూనియర్ నటించిన సినిమాల్లోని నటన ఒకెత్తు, తాజాగా విడుదలయిన "జనతా గ్యారేజ్" సినిమాలోని నటన ఒకెత్తు అంటున్నారు సినీ విశ్లేషకులు. రొటీన్ ఊర మాస్ క్యారెక్టర్ కాదు, గత చిత్రం లాగా క్లాస్ క్యారెక్టరూ కాదు.. కానీ ఏదో ఒక తెలియని కొత్తదనం ఈ సినిమాలో కనిపిస్తుంది. ముఖ్యంగా యంగ్ టైగర్ చెప్పే చిన్న చిన్న డైలాగులు, వాటి ప్రజెంటేషన్ అద్భుతహ! ఈ సినిమా ఏస్థాయి హిట్టు అనే విషయం కాసేపు పక్కనపెడితే... నటుడిగా మాత్రం జూనియర్ మరో మెట్టు ఎక్కాడనడంలో సందేహం లేదనే చెప్పాలి. ఆనంద్ పాత్ర అతడికి పూర్తి భిన్నమైంది. హడావిడి లేదు, తొడకొట్టడాలు, పేజీల పేజీల డైలాగులు చెప్పడం కూడా లేదు.. కేవలం సింపుల్ గా కొత్త రకంగా నటించి మెప్పించాడు. ఎదురుగా మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్ ఉన్నాకూడా ఎంతో కాన్ఫిడెంటుగా నటించి మెప్పించినందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
సీన్స్ వారీగా మాట్లాడుకుంటే.. ఇంటర్వెల్ కు ముందు మోహన్ లాల్ ను తొలిసారి కలిసే సన్నివేశంలో ఎన్టీఆర్ విజిల్స్ వేయించాడు. ఈ సీన్ లో మోహన్ లాల్ - తారక్ ఉన్నా కూడా ఈ యంగ్ హీరో డిక్షన్ పైనే అందరి దృష్టి నిలుస్తుంది. ఇక రాజీవ్ కనకాల ఆఫీసులో జరిగే ఎపిసోడ్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకటని చెప్పుకుని తీరాల్సిందే. మోహన్ లాల్ లాంటి కంప్లీట్ స్టార్ ముందు కూడా తన ప్రత్యేకత చాటుకుని.. నటుడిగా తన స్థాయిని మరోసారి చాటిచెప్పాడు.