నాన్నగారికి నేను చివరగా ఇచ్చిందదే: ఎన్టీఆర్

Update: 2018-10-07 07:59 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత' అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  రిలీజ్ కు నాలుగు రోజులే ఉండడంతో ఎన్టీఆర్ మీడియాకు ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ గా గడుపుతున్నాడు.  'అరవింద సమేత' విశేషాలే కాకుండా పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటున్నాడు.  నాన్నగారు నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం షాక్ నుండి ఇంకా కోలుకోలేదన్న సంగతి ఎన్టీఆర్ మాటల్లోనే అర్థం అవుతోంది.

నాన్నగారి మరణానికి కొద్దిరోజుల ముందు తనకు ఫోన్ చేశారని 'పలావ్' పంపించమని అడిగారని చెప్పాడు.  ఎన్టీఆర్ మంచి భోజనప్రియుడే కాదు సూపర్ కుక్ అని అందరికీ తెలిసిందే కదా. అందుకే హరికృష్ణ అలా అడిగారు. దీంతో ఇంటికి వెళ్ళగానే స్వయంగా పలావ్ చేసి మరీ నాన్నగారికి పంపానని చెప్పాడు. నాన్నకు చివరిసారిగా తను ఏదైనా ఇచ్చానంటే అది పలావేనని  చెప్పాడు.. ఇప్పుడిక అయన లోకంలోనే లేరు.. అని ఎమోషనల్ అయ్యాడు.  తన వంట గురించి మాట్లాడుతూ ఇంట్లో అమ్మగారు.. తనే వంట చేస్తామని ఎందుకంటే ప్రణతికి పెద్దగా వంట రాదని చెప్పాడు.  

మళ్ళీ హరికృష్ణ గారి గురించి మాట్లాడుతూ చివరి రోజుల్లో తనకు తరచుగా కాల్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అని అడిగేవారని లేదా ఏదైనా విషయం మాట్లాడేవారని... మరి ఆయనకు ఏదో చెడు జరగనుందని ముందే అనిపించిందో ఏమో.. అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
    

Tags:    

Similar News