​ఎన్టీఆర్ తొందర పెట్టేస్తున్నాడట...

Update: 2017-06-28 07:24 GMT
రాబోతున్న ‘జై లవ కుశ’ తో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపే ప్రయత్నం చేస్తున్నాడు. కామన్ మాన్ గా విలన్ గా విచిత్ర వేషధారణలో అభిమానులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ఎన్టీఆర్ కు ప్రతినాయకుడుగా కనిపించబోతున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండా రిలీజ్ డేట్ ను ప్రకటించి షాకిచ్చారు.

నిజానికి ఇంకా 40 శాతం షూటింగ్ పెండింగ్ ఉందట. ఏది ఏమైనా దసరా విడుదల అవకాశాన్ని వదులుకోకూడదు అని గట్టి పట్టుదలతో ఉన్నాడట ఎన్టీఆర్. అందుకే అగస్ట్ నెల పూర్తయ్యేపాటికి షూటింగ్ పూర్తి చేయాలిని గడువు పెట్టేసి.. సెప్టెంబర్ 21 నాడు విడుదల చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. దీనితో డైరెక్టర్ బాబీ తీవ్ర ఒత్తిడితో పని చేస్తునట్లు టాక్. దసరా సెలవులకు సినిమా కలెక్షన్లు మామూలు రోజులు కన్న ఎక్కువగానే ఉంటాయి అందుకని ఆ సమయంలో సినిమా విడుదల చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని భావించి ఎన్టీఆర్ తొందరపెడుతున్నట్లున్నాడు. ఇక ఇదే సమయంలో మహేశ్ బాబు స్పైడర్ - బాలయ్య పైసా వసూల్ సినిమా వస్తున్నాయి. కాకపోతే ‘జై లవ కుశ’ వాటి కన్నా ఒక వారం ముందు వచ్చి కొంత బాక్స్ ఆఫీసు కలెక్షన్లు సొంతం చేసుకునే ప్రయత్నం చేయనుంది..

పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్  టైమ్ అప్పుడు  కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కున్నాడు డైరెక్టర్ బాబీ. ‘జై లవ కుశ’ సాంకేతిక విలువలు కోసం బాగానే ఖర్చు పెడుతున్నారు. సినిమా కోసం ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ లు పని చేస్తున్నారు. మరి బాబీ డెడ్ లైన్ లోపు పూర్తి చేయడం కంటే.. క్వాలిటీ చూసుకోవడమే బెటరేమో. చూద్దాం ఎన్టీఆర్ అండ్ బాబీ చివరకు ఏం చేస్తారో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News