3ఆర్ లకు రంగం సిద్ధం

Update: 2018-09-17 06:23 GMT
టాలీవుడ్ లో గత చాలా ఏళ్ళుగా దేనికీ రాని క్రేజీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న రాజమౌళి-తారక్-చరణ్ ల కాంబో మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఇరు హీరోల అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనికి ముహూర్తం సెట్ చేసే దిశగా జక్కన్న పావులు కదుపుతున్నట్టు సమాచారం. డిసెంబర్ 15 దాటితే మంచి ముహుర్తాలు లేని నేపధ్యంలో ఆలోపే ప్రారంభోత్సవం చేసి కొంత పార్ట్ షూట్ చేసి కార్తికేయ పెళ్లి కోసం గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. తారక్ ప్రస్తుతం అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ ఫైనల్ స్టేజిలో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్ ను కలుపుకుంటే అక్టోబర్ మూడో వారం తర్వాత పూర్తిగా ఫ్రీ అయిపోతాడు. కొత్త కథలు విన్నా దర్శకులను కలిసినా రాజమౌళి సినిమా కన్నా ముందే ఉండే అవకాశం లేదు కాబట్టి చర్చలను ఒక కొలిక్కి తెచ్చుకుని తర్వాత సినిమాను లైన్ లో పెట్టుకోవడానికి చేతిలో ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటాడు.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే బోయపాటి శీను సినిమా కోసం విదేశాల్లో యాభై రోజుల షెడ్యూల్ కోసం చేస్తున్న టాస్క్ పూర్తి కాగానే వెనక్కు వచ్చేస్తాడు. బాలన్స్ షూట్ పాటల చిత్రీకరణ ఇవన్నీ అటు ఇటుగా నవంబర్ మూడు లేదా నాలుగో వారం దాకా జరిగేలా ఉన్నాయి. ఆ లోపు నిర్మాత డివివి దానయ్య పూజా కార్యక్రమం పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ఇక్కడే ఉంటాడు. కొన్ని సీన్లు మాత్రమే షూట్ చేస్తారు కాబట్టి ఏ సమస్యా లేదు. హీరోయిన్ల ఎంపికలో రాజమౌళి ఏ చిన్న లీక్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. క్రేజీ ప్రాజెక్ట్ తో పాటు కాల్ షీట్స్ ఎక్కువ డిమాండ్ చేసే సబ్జెక్టు కాబట్టి ఆర్టిస్టుల ఎంపిక అప్పటికప్పుడు చేసేది కాదు. సో బ్యాక్ గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది. కానీ ఏది బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో మాస్టర్ అయిన రాజమౌళి ఇలాంటి ప్రాజెక్ట్ కి  ఇంకెంత కేర్ ఫుల్ గా  ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాలా.
Tags:    

Similar News