#RRR దేవ‌గ‌ణ్ టాప్ సీక్రెట్స్ అలా లీక్

Update: 2020-01-29 13:55 GMT
#RRR సెట్స్ లో దేవ‌గ‌ణ్ తో షూటింగులో పాల్గొన్న ఆ ఇద్ద‌రు గ‌న్స్ ఎవ‌రో  ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. గ‌త వారం రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. దేవ‌గ‌ణ్‌- రామ్ చ‌ర‌ణ్‌- తార‌క్ బృందంపై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ స్టార్ తో మ‌న టాప్ స్టార్లు ఇద్ద‌రూ ఇదిగో ఇలా ఛాయాచిత్రానికి ఫోజిచ్చారు. మ‌రో ఫోటోలో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి వీళ్ల‌తో జాయిన్ అయ్యాడు.

దేవ‌గ‌ణ్ ఎంతో సింపుల్ గా మ‌న స్టార్ల‌తో క‌లిసిపోయాడ‌ని ఆ ఫోటోలు చూస్తుంటేనే అర్థ‌మ‌వుతోంది. ఇంకో నాలుగు రోజుల పాటు దేవ‌గ‌ణ్ ఇక్క‌డ‌ షూటింగ్ లో పాల్గొంటార‌ట‌. ప్ర‌స్తుతం దేవ‌గ‌ణ్ కి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ కి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యం లీకైంది.

తెలుగులో ప‌లువురు అగ్ర హీరోల‌కు ఉన్న‌ట్టే దేవ‌గ‌ణ్ కి కూడా వారం వ‌ర్జ్యం సెంటిమెంట్లు కూడా ఎక్కువేన‌ట‌. దేవ‌గ‌ణ్ కి సంబంధించిన ఏవైనా ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకునే ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ ఆర్.ఎఫ్‌.సీలో త‌న వెంటే ఉన్నార‌ట‌. వాస్తు.. జాత‌కాలు .. మంచి చెడు.. దుర్ముహూర్తం ఇవ‌న్నీ చూసేది మ‌న తెలుగు వాడేన‌ని తెలిసింది. RRR షూటింగు లో మొత్తం ఆయ‌నే చూస్కుంటున్నాడ‌ట‌. ఈ చిత్రంలో ఆంగ్లేయుల‌తో క‌లిసి ప‌ని చేసే ఒక పోలీస్ అధికారి పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్నార‌ని ఇంత‌కుముందు ఓ స‌మాచారం లీకైంది. అలాగే చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా.. తార‌క్ కొమురం భీమ్ గా న‌టిస్తున్నారు. ఆ రెండు పాత్ర‌లతో దేవ‌గ‌ణ్ పాత్ర‌కు ఉన్న క‌నెక్టివిటీ ఏమిటి? అన్న‌ది పెద్ద తెర‌పైనే చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ జూలై 30 నుంచి ద‌స‌రాకి వాయిదా ప‌డింద‌ని.. లేదూ 2021 సంక్రాంతికే వ‌స్తుంద‌ని ర‌క‌ర‌కాల పుకార్లు షికారు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా జక్క‌న్న మాత్రం త‌న ప‌నేదో తాను చేసుకుపోతున్నాడు. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెబుతుంది అన్న‌ట్టుగా ఉంది ఆయ‌న వ్య‌వ‌హార శైలి.



Tags:    

Similar News