మ‌నోళ్లు జ‌ప‌నీస్ ని చింపేసారు క‌ద‌య్యా!

Update: 2022-10-26 10:30 GMT
భాష మాట్లాడ‌టం అంత వీజీనా? అదీ దేశం కానీ దేశంలో? ఇండియాలో ఉన్న అన్ని భాష‌లు మాట్లాడ‌ట‌మే జ‌రిగేది కాదు. మాతృభాష...ఇంగ్లీష్..హిందీ త‌ప్ప ఇకే  భాష మాట్లాడాల‌న్నా? అందుకు ప్ర‌త్యేక శిక్ష‌ణ అవ‌స‌రం. కొన్ని నెల‌లు పాటు ట్రైనింగ్ అనంత‌రం భాష‌పై కాస్త అవగాహ‌న వ‌స్తుంది. ఆ త‌ర్వాత చిన్న‌గా మాట్లాడే ప్ర‌య‌త్నాలు చేస్తాం.

కానీ మ‌నోళ్లు ఇద్ద‌రు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాత్రం ఏకంగా మ‌న‌ది కాని భాష‌ని..దేశం కానీ దేశంలోనే ఆదేశ భాష‌ని చెడుగుడు అడేసారు. ఇటీవ‌లే జ‌పాన్ లో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారంలో భాగంగా తార‌క్...చ‌ర‌ణ్  పాల్గొన్నారు. ఇక మీడియా ముందుకెళ్ల‌గానే ఇద్ద‌రు ఓ రేంజ్ లో జ‌ప‌నీస్ భాష సంగ‌తేంటో చూడాల‌నుకున్నారో? ఏమో గానీ.... ఇద్ద‌రూ ర‌ఫ్పాడించేసారు.

చ‌ర‌ణ్ ఇంగ్లీష్ మ‌ధ్య‌లో జ‌ప‌నీస్ మాట్లాడినా..తార‌క్ మాత్రం జ‌పాన్ చింపేసాడ‌నే చెప్పాలి. మైక్ ప‌ట్టుకుని ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కూ జ‌పాన్ భాష‌ని ఎంతో చ‌క్క‌గా అన‌ర్ఘ‌ళంగా మాట్లాడ‌టం విశేషం. తెలుగు హీరోలు హిందీ మాట్లాడ‌టే చాలా క‌ష్ట‌మైన ప‌ని. నానా అవ‌స్త‌లు ప‌డిపోతారు. అలాంటిది ఏకంగా జ‌పాన్ భాష‌లోనే తార‌క్ మాట్లాడ‌టం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

అస‌లు తార‌క్ జ‌పాన్ వెళ్లింది ఎప్పుడు? జ‌ప‌నీస్ని ఎప్పుడు నేర్చుకున్నాడు? అంత అన‌ర్ఘ‌ళంగా మాట్లాడ‌టం ఎలా సాధ్య‌మైందంటూ అభిమానుల్లో వాడి వేడి చ‌ర్చ‌కు దారి తీసింది. తార‌క్ తెలుగు..హిందీ..ఊర్దు...క‌న్న‌డ భాష‌లు అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ చూసాం . తొలిసారి జ‌పాన్ భాష‌ని సైతం త‌న‌కి బాగా తెలిసిన భాష‌లా మాట్లాడ‌టం  అంద‌ర్నీ స‌ర్ ప్రైజ్ కి గురి చేసింది.

చ‌ర‌ణ్‌..తార‌క్ కంటే ముందుగా పాన్ ఇండియా స్టార్ అయిన డార్లింగ్ ప్రభాస్ ఇంత వ‌ర‌కూ చాలా దేశాల్లో ప్ర‌మోష‌న్ చేసాడు. కానీ ఇంగ్లీష్ తో స‌రిపెట్టాడు త‌ప్ప ఏనాడు స్థానిక భాష‌లో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కానీ చర‌ణ్..తార‌క్ మాత్రం ఆ స్టార్ కి భిన్నంగా ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అవ్వ‌డం విశేషం. ఇద్ద‌రు గట్లోళ్లే..తెలివైన వారే అని మ‌రోసారి నిరూపించుకున్నారు.

వీళ్ల ఊపు చూస్తుంటే?  రాజ‌మౌళి ప‌క్క‌నుంటే ప్ర‌పంచంలో ఏ దేశ భాష‌నైనా చీల్చీ చెండాయ‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది సుమీ. కేవ‌లం ప్రెస్ మీట్కి పూట‌..రెండు   పూటల ప్రాక్టీస్ తోనే ఇలా మాట్లాడారంటే ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ల‌ని త‌ట్టుకోగ‌ల‌మా.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News