తన భాష యాస ట్రోల్స్ పై ఎన్టీఆర్‌ రియాక్షన్‌

Update: 2023-01-18 10:03 GMT
యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటుకు గోల్డెన్‌ గ్లోబ్ అవార్డు సొంతం అయిన సమయంలో ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపర్చిన విషయం తెల్సిందే. ఇంగ్లీష్‌ లో అద్భుతమైన స్లాంగ్ లో ఎన్టీఆర్‌ మాట్లాడిన తీరును చాలా మంది ప్రశంసించారు.

కొందరు మాత్రం ఇది అమెరికన్ యాస నా అంటూ ట్రోల్స్ చేశారు. సాధారణంగా ఇంగ్లీష్ మాట్లాడితే పోయేది కదా.. ఎందుకు ఇంతగా కష్టపడటం అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అమెరికన్ స్లాంగ్ పేరుతో ఎన్టీఆర్‌ అర్థం కాకుండా మాట్లాడాడు అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా ట్రోల్స్ చేయడం జరిగింది.

తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్లాంగ్‌ పై వచ్చిన ట్రోల్స్ కు స్పందించాడు. దేశాన్ని బట్టి ఒక్కో యాస ఉంటుంది.

ఎవరి భాష వారిది.. ఎవరి యాస వారిది అన్నట్లుగా ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్‌ ను విమర్శించిన వారిని ఆయన ఫ్యాన్స్ కూడా తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నారు.

ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఇంకా కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ హడావుడిలోనే ఆయన కనిపిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ 30 సినిమా వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్ కు అంతా సిద్ధంగా ఉంది.

వచ్చే ఏడాదిలో ఎన్టీఆర్‌ 30 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను మరియు ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమాను ఎన్టీఆర్ చేసేందుకు కమిట్‌ అయ్యాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News