జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద క్లాస్ నే ఇచ్చాడు. నాన్నకు ప్రేమతో టైమ్ లో తన దృష్టికి వచ్చిన రెండు సంఘటనలు గుర్తు చేసుకున్న జూనియర్.. అలాంటివి చేయద్దంటూ అభిమానులకు సుతి మెత్తగానే అంటించేశాడు.
' రెండు విషయాలు క్షుణ్ణంగా మాట్లాడాలని అనుకుంటున్నా.. ఇది తప్పుగా అనుకున్నా ఒప్పుగా అనుకున్నా సరే పర్లేదు. నాన్నకు ప్రేమతో రిలీజ్ అయ్యాక ఓ ఫోటో చూశాను. ఓ కటౌట్ కి పాలతో అభిషేకం చేస్తున్నారు. పాలాభిషేకం చేసేది దేవుడికి.. నేను దేవుడిని కాదు.. మీ తమ్ముడిని అంతే. మీ అభిమానాన్ని కాదనను. కానీ ఆ పాలను అదే పాలను నా ఫోటోపై చల్లేకంటే.. ఏదన్నా అనాథ శరణాలయంలో ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు పిల్లలు పోషకాహారం లేక బాధపడుతున్నారు. ఆ పాలను వారికి ఇస్తే మీకు నాకు పుణ్యం వస్తుంది' అంటూ పాలాభిషేకాలు చేయద్దని చెప్పాడు ఎన్టీఆర్.
'ఇంకోటి కూడా మాట్లాడాలి. ఇది కూడా నాన్నకు ప్రేమతో టైమ్ లోనే జరిగింది. ఓ మూగ జంతువును బలిచ్చారు. అభిమానం ఉంటే అన్నదానం చేయండి. అంతే కానీ.. ఇలాంటివి చేయకండి. ఇక్కడున్నోళ్లు.. టీవీలు చూస్తున్న అభిమానులు పాటిస్తారని ఆశిస్తున్నాను' అని చెప్పిన ఎన్టీఆర్.. చివర్లో ఎప్పటిలాగానే 'జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి.. ఇంట్లో అమ్మానాన్నలు ఎదురుచూస్తుంటారు' అంటూ ఓ మంచి మాట చెప్పాడు. చివరగా జనతా గ్యారేజ్ టీజర్ లో డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ లో జోష్ పెంచాడు.