యంగ్ టైగర్ ఎన్టీఆర్ - హీరో మంచు మనోజ్ మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. కానీ వీరిద్దరి స్నేహం ఇప్పటిది కాదు.. చిన్ననాటిదే. సీనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా షూటింగ్ టైంలో మనోజ్-ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అయ్యారట. అయితే వీరిద్దరూ ఒకే రోజు కొన్ని గంటల గ్యాప్ తోనే పుట్టారు. మనోజ్ కంటే ఎన్టీఆర్ ఆరు గంటల పెద్దవాడట. మనోజ్ చాలా అల్లరోడు. మనోజ్ అల్లరి పనుల వలన ఎన్టీఆర్ అనేకసార్లు ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. అంతేగాక మేమిద్దరం ఈ భూమ్మీదకి ఇలా వచ్చాము.. అంటూ మనోజ్‌కు ఎన్టీఆర్ ఓ బ్రహ్మకథ చెప్పేవాడినని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ కథ ఏంటంటే.. ‘బ్రహ్మదేవుడు ఓసారి దీర్ఘంగా ఆలోచించి రెండు బొమ్మలను తయారుజేశాడు. అందులో ఒకటి కొంచెం తెల్లగా - మరొకటి కొంచెం నల్లగా - ఒకదానికి కొంచెం రింగుల జుట్టు - ఇంకొదానికి కొంచెం సిల్కీ హెయిర్. ఇలా చిన్న చిన్న మార్పులతో.. ఆలోచనా విధానం మాత్రమే ఒకేలా ఉండేలా రెండు బొమ్మలు రూపొందించాడు.
ఆ రెండు బొమ్మలకు ఓ పరీక్ష పెట్టాడట. అప్పుడు ఓ బొమ్మ చాలా వినయంగా ఎలాంటి అల్లరి చేయకుండా ఉంది. అది చూసి బ్రహ్మదేవుడు.. ‘ఈ బొమ్మ చాలా పద్ధతిగా ఉంది. కాబట్టి దీన్నే ముందు భూమ్మీదకి పంపిస్తాను.’ అని చెప్పి మొదటి బొమ్మను కిందకు పంపించారు. అదే నేను(ఎన్టీఆర్). అయితే బ్రహ్మ చేతిలో ఉన్న రెండో బొమ్మ.. ‘మా ఇద్దరిని ఒకేసారి తయారు చేసి.. వాడిని ఎలా ముందు భూమ్మీదకి పంపిస్తారు’ అనుకుని ఆయన్ని గట్టిగా గిల్లిందట. దీంతో బ్రహ్మదేవుడు ‘నన్నే ఇంత ఇబ్బంది పెట్టాడంటే ఈ బొమ్మ తప్పకుండా మోహన్ బాబు ఇంట్లోనే పుట్టాలి’ అని బ్రహ్మదేవుడు రెండో బొమ్మను మోహన్ బాబు ఇంట్లో పుట్టించాడు. వాడే మనోజ్. అక్కడి నుంచి నాకు టార్చర్ మొదలైంది. వాడు వస్తున్నాడంటే ముందే ప్రకృతి హెచ్చరికలను పసిగడతాను. ఇద్దరం ఒకేసారి పుట్టాం. కానీ నేను మనోజ్ కంటే కొన్నిగంటల ముందు పుట్టాను. అయినా వాడు నాకు ఎలాంటి గౌరవం ఇవ్వడు. ఏరా.. ఏంట్రా అని పిలుస్తాడు’ అని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో సరదాగా బయటపెట్టాడు. వీరిద్దరూ మే 20న అంటే నిన్న తమ 37వ బర్త్డే జరుపుకున్నారు.