'బిజినెస్ మ్యాన్'గా మారబోతున్న ఎన్టీఆర్...?

Update: 2020-05-24 05:26 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో 'ఆర్.ఆర్.ఆర్' సెట్స్ మీద ఉండగానే తారక్ మరో సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా ఉండబోతోందని అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌ పై రాధాక‌ష్ణ‌ (చినబాబు) - నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అందువల్ల ఈ సినిమాలో పలువురు ఇతర ఇండస్ట్రీ స్టార్ యాక్టర్స్ కూడా నటించబోతున్నారట. ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ టాప్ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తాడట. దీని కోసం క్రేజీ మేక్ ఓవర్ లో ఎన్టీఆర్ వెరీ స్టైలిష్ గా కనిపిస్తాడట. ఆర్.ఆర్.ఆర్ సినిమా కంప్లీట్ చేసిన వెంటనే తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంభందించి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందట. పాన్ ఇండియా మూవీ కావడంతో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇప్పటికే హీరోయిన్స్ కోసం వేట మొదలు పెట్టారట. అన్నీ కుదిరితే ఈ ఏడాది నవంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్ లో విడుదల చేయాలని భావించారట. కానీ ఇప్పుడు పరిస్థితులలో ప్లాన్స్ అన్నీ తారుమారు అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
Tags:    

Similar News