హడావుడి పడితే అసలుకే మోసం వస్తుందంటూ ‘జనతా గ్యారేజ్’ను ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 2కు వాయిదా వేయడం మంచి నిర్ణయమే. ఐతే 20 రోజులు వాయిదా పడ్డాక కొంచెం ప్రశాంతంగా పని పూర్తి చేసుకోవాల్సిన గ్యారేజ్ టీం.. ఇప్పుడు కూడా హడావుడి పడుతోంది. ఈపాటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ సన్నాహాల్లో ఉంటుందనుకుంటే.. ఇంకా కూడా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్-కాజల్ మీద పాటతో పాటు పెండింగులో ఉన్న ఒకట్రెండు చిన్న సన్నివేశాలు కూడా తీస్తున్నాడట కొరటాల. సోమవారానికి పనిపూర్తవుతుందని అంటున్నారు.
ఇక ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేసి.. సర్వం సిద్ధం చేసేసరికి ఇంకో వారం రోజులైనా పడుతుంది. ఇక ఆ తర్వాత సెన్సార్.. ప్రమోషన్.. విదేశాలకు డిస్కులు పంపించడం అంతా కూడా హడావుడే అయ్యేట్లుంది. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా.. రిలీజ్ డేట్ మీద ఎఫెక్టు పడుతుంది. అందుకే గ్యారేజ్ టీం కొంచెం టెన్షన్ టెన్షన్ గానే ఉంది. ఐతే కొరటాల ఆడియో వేడుకలో చెప్పినట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సెప్టెంబరు 2నే విడుదల చేయాలని భావిస్తున్నారు. అదేంటో కానీ.. ఈ మధ్య ఎన్టీఆర్ సినిమాలన్నింటికీ చివర్లో ఇలాంటి హడావుడే కనిపిస్తోంది. టెంపర్.. నాన్నకు ప్రేమతో సినిమాలకు కూడా ఇలాగే జరిగింది. ఐతే ఆ సినిమాలు బాగా ఆడాయి. ఆ హడావుడినే సెంటిమెంటుగా భావించి.. ‘గ్యారేజ్’ విషయంలోనూ లేట్ చేస్తున్నారో ఏంటో?