అదేమిటో ఎన్టీఆర్‌కు రిలీజ్ డేట్ విషయంలో ఎప్పుడూ తకరారే. గత రెండు సినిమాల రిలీజ్ డేట్ విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాల రిలీజ్ విషయంలో ఎంతో గందరగోళం నెలకొంది. చివరికి మంచి తేదీల్లోనే ఈ సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఫలితాలు తేడా కొట్టేశాయి. ఇక యంగ్ టైగర్ కొత్త సినిమా టెంపర్ విషయంలోనూ చాలా సస్పెన్సే నడిచింది. చివరికి ఫిబ్రవరి 13న ముహూర్తం కుదిరింది. ఐతే ఈ తేదీ అంత మంచిది కాదేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకప్పుడు ఫిబ్రవరిలో సినిమాలు రిలీజ్ చేయడానికి సాహసించేవారు కాదు. ఈ టైంలో విద్యార్థులంతా చదువుల్లో మునిగిపోతారు. ఐతే ఇప్పుడంతా వారం రెండు వారాల వ్యవహారం కాబట్టి ధైర్యంగా రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఫిబ్రవరి మొదటి వారమైతే ఓకే కానీ.. రెండో వారం నుంచి పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంటుంది. యూత్ థియేటర్లకు రావడం కష్టమే. కాబట్టి టెంపర్ ఫిబ్రవరి 5న కాకుండా 13 రావడం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చు. పైగా మరుసటి రోజే వన్డే ప్రపంచకప్ మొదలవుతోంది. 15న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో టెంపర్‌కు ఆరంభ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి మరి.